nandamuri balakrishna son mokshagna entry coming soon
Balakrishna : నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. మరో నందమూరి హీరో కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అంటూ దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుండి ఇండస్ట్రీ వర్గాల్లో మరియు నందమూరి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఆ మధ్య బాలకృష్ణ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వయంగా తన కొడుకుని సినిమాల్లో ఎంట్రీ ఇప్పియ్యబోతున్నట్లుగా ప్రకటించాడు….
Balakrishna : మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ తప్పకుండా భారీ సినిమా అవుతుంది అంటూ బాలకృష్ణ ఆ సమయంలో పేర్కొన్నాడు, కానీ మోక్షజ్ఞ మాత్రం సినిమాల్లో హీరోగా నటించే ఆసక్తి లేని వాడిలా కనిపిస్తున్నాడు. ఇప్పటికి కూడా భారీ శరీరంతో ఏమాత్రం లావు తగ్గకుండా కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందంటూ ఇటీవల నందమూరి కుటుంబ సన్నిహితులతో బాలకృష్ణ చెప్పుకొచ్చాడట. కానీ బాలకృష్ణ ఇప్పటికీ కూడా తన కొడుకు ఎవరి దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తాడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
nandamuri balakrishna son mokshagna entry coming soon
మరోవైపు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఫిజిక్ విషయంలో నందమూరి అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.హీరోలకు ఉండాల్సిన నాజూకైనా ఫిజిక్ మోక్షజ్ఞ కి ఏమాత్రం లేదు, అందుకే ఆయన హీరోగా సెట్ అవ్వకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా చాలా బరువు ఉండేవాడు కాని సినిమా ల్లో ఎంట్రీ ఇచ్చే సమయంకు చాలా సన్నగా అయ్యాడు. మోక్షజ్ఞ మరియు నందమూరి బాలకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తారని ఆ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో.. తండ్రితో కలిసి నటించేది ఎప్పుడో చూడాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.