Taraka Ratna : జీవితం మొత్తం దురదృష్టమే.. తారకరత్న జీవితంలో కష్టాలు పడిన సందర్భాలు ఇవే..!!
Taraka Ratna : నందమూరి తారకరత్న చిన్న వయసులోని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన కెరీర్ లో వ్యక్తిగతంగా, సినిమాల పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తారక రత్న సినీ రంగంలో ఒకేసారి 9 సినిమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏ హీరో ఓకే రోజు 9 సినిమాలను స్టార్ట్ చేయలేదు. సినీ చరిత్రలో ఏ హీరోకి దక్కని రికార్డును తారకరత్న సొంతం చేసుకున్నాడు. గ్రాండ్ గా సినీ రంగంలోకి ఎంటర్ అయిన తారకరత్న కెరీర్ ఊహించని మలుపులు తిరిగింది. ఒకేసారి తొమ్మిది సినిమాల ప్రారంభోత్సవం జరుపుకున్న తొమ్మిది సినిమాలలో నాలుగు ఐదు సినిమాలు మాత్రమే వచ్చాయి. మిగతావి కొన్ని కారణాలతో ఆగిపోయాయి.
ఇక తారకరత్న మొదటి సినిమా నంబర్ వన్ కుర్రాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ తర్వాతి సినిమాలోతో తారకరత్నకు అంతా క్రేజ్ అయితే రాలేదు. ఈ సినిమా తర్వాత తారకరత్న యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు సినిమాలు చేశాడు. అవి ఊహించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. హీరోగా వరుస పరాపజయాలు అందుకున్న తారకరత్న విలన్ అవతారం ఎత్తి తనేంటో నిరూపించుకున్నాడు. రఘు బాబు దర్శకత్వం వహించిన ‘ అమరావతి ‘ సినిమాలో తారకరత్న విలన్ పాత్ర చేసి నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అతనికి ఎక్కువగా సినీ ఆఫర్స్ రాలేదు. సినీ జీవితం ఇలా ఉంటే మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. కుటుంబ అంగీకారం లేకుండా పెళ్లి అయి
విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో తారకరత్నను నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టేసింది. ఒకవైపు సినీ కెరీర్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న తారకరత్న చివరకు రాజకీయాల వైపు అడుగులు వేశాడు. తెలుగుదేశం పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునే లోపు అతడిని మృత్యువు గుండెపోటుతో కబళించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తారకరత్న రాజకీయాలలోకి సక్సెస్ అయ్యి మంచి స్థితికి చేరుకోవాలనుకున్న టైంలో హఠాత్తుగా మరణించడం అందరికీ బాధాకరం. జీవితమంతా తారకరత్నను దురదృష్టం వెంటాడింది. చిన్న వయసులోని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.