Dasara Movie : విడుదలకి ముందరే ఎవ్వరూ కొట్టలేని రికార్డ్ బద్దలు కొట్టిన దసరా సినిమా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dasara Movie : విడుదలకి ముందరే ఎవ్వరూ కొట్టలేని రికార్డ్ బద్దలు కొట్టిన దసరా సినిమా..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 March 2023,9:00 pm

Dasara Movie : అష్టా చమ్మా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు హీరో నాని. ఈ సినిమా హిట్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. చూడడానికి న్యాచురల్ అనిపించడంతో నాచురల్ స్టార్ నానిగా పేరు సంపాదించుకున్నాడు. వైవిద్యమైన పాత్రలు చేస్తూ తనేంటో ప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా నాని నటించిన సినిమా ‘ దసరా ‘. ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ తో నాని అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడని తెలుస్తుంది.

Nani Dasara Movie break the records

Nani Dasara Movie break the records

ఊర మాస్ లుక్ లో నాని కనిపించడంతో అభిమానులు ఈ సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల వహించాడు. నానికి జోడిగా కీర్తి సురేష్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ విడుదల దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఈ సినిమా యూనిట్ ఓపెన్ చేసింది.

Chamkeela Angeelesi - Lyrical | Dasara | Nani, Keerthy Suresh | Santhosh  Narayanan | Srikanth Odela - YouTube

ప్రస్తుతం ఈ సినిమా టికెట్లు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో దసరా సినిమాకి 100కె ఇంట్రెస్ట్ లను దక్కించుకుంది. ఇది నాని కెరీర్ లోని పెద్ద రికార్డు అని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఒకేరోజు విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్ మేకప్ లేకుండా నటించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ పాటలో కీర్తి సురేష్ మేకప్ లేకుండా తన అందంతో ప్రేక్షకులం కట్టిపడేసింది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది