Hero Nani : క్రేజీ ఆఫర్ కు నో చెప్పిన నాని .. రజినీకాంత్ – అమితాబచ్చన్ సినిమాకు రిజెక్టెడ్ .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hero Nani : క్రేజీ ఆఫర్ కు నో చెప్పిన నాని .. రజినీకాంత్ – అమితాబచ్చన్ సినిమాకు రిజెక్టెడ్ ..

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2023,11:00 am

Hero Nani : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవల ‘ దసరా ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘ హాయ్ నాన్న ‘ సినిమాలో నటిస్తున్నాడు. అయితే నాని ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్టుకి నో చెప్పాడని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రజినీకాంత్, అమితాబచ్చన్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఓ పాత్ర కోసం నానిని ఆఫర్ చేశారట. కానీ అది నెగిటివ్ పాత్ర కావడంతో నాని దానికి అంగీకరించలేదని సమాచారం.

అయితే నాని ఎప్పుడు ప్రయోగాలు చేయడానికి ముందుంటాడు. అలాంటిది ఈ సినిమాకు ఎందుకు నో చెప్పాడా అని అందరికీ సందేహం వస్తుంది. అయితే ఈ పాత్రకు శర్వానంద్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మామూలుగా అయితే నాని ప్రయోగాలు చేయడానికి అసలు వెనకాడడు. ఇప్పటికే నాని కెరియర్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. నాని సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రతి సినిమాకు ఒక్కో వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు. అలాంటిది ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడు అని అంటున్నారు.

Nani has declined the offer due to the unconventional nature of the role

Nani has declined the offer due to the unconventional nature of the role

దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్, అమితాబచ్చన్ కలిసి నటించబోతున్నారు. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను రెడీ చేశాడు. విలన్ పాత్ర కోసం నానిని అడిగితే నో చెప్పాడట. అందుకే ఆ ఆఫర్ శర్వానంద్ కు వెళ్లినట్లు సమాచారం. రజినీకాంత్, అమితాబచ్చన్ లతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాదు. అంత పెద్ద చాన్స్ నాని ఎందుకు వదిలేశాడు. అయితే దీనికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అని అంటున్నారు. ఇక శర్వానంద్ విలన్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. రజినీకాంత్ అమితాబచ్చన్ అంటే అది పాన్ ఇండియన్ సినిమానే. ఇంత పెద్ద మల్టీ స్టారర్ మూవీని నాని మిస్ చేసుకున్నందుకు అభిమానులు ఫీలవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది