Nani Dasara Movie : నక్క తోక తొక్కిన నాని .. దసరా సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని నెలలు అయినా సూపర్ గుడ్ న్యూస్ !
Nani Dasara Movie : నాచురల్ స్టార్ గా పేరు పొందిన టాలీవుడ్ హీరో నాని ఇటీవల ‘ దసరా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా నాని ఊర మాస్ లుక్ లో కనిపించాడు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో నాని దసరా సినిమా ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. ఇక ఈ […]
Nani Dasara Movie : నాచురల్ స్టార్ గా పేరు పొందిన టాలీవుడ్ హీరో నాని ఇటీవల ‘ దసరా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా నాని ఊర మాస్ లుక్ లో కనిపించాడు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో నాని దసరా సినిమా ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. ఇక ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది. చాలా న్యాచురల్ లుక్ లో కీర్తి సురేష్ నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
అత్యధిక వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇటీవల ఓటిటి లో ప్రసారమైంది. నాని గత సినిమాలు థియేటర్లో సరిగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేసాయి. వాటితో నాని హ్యాపీనే ఉన్నా థియేటర్ మార్కెట్ పడిపోతుందని బాధ నానీలో ఉంది. ఇక దసరా సినిమాతో నాని థియేటర్ మార్కెట్ ను పెంచేసింది. ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ దాటేసిన దసరా తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మాస్ సినిమాను కుటుంబ సమేతంగా అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు.
నిన్నటి నుంచి ఓటిటి ప్రేక్షకులు దసరా సినిమాలు పదేపదే చూస్తూ మంచి వ్యూస్ అందిస్తున్నారు. ఏదేమైనా దసరా హీరోగా నాని థియేటర్స్ లో ఇటు ఓటిటిలో రెండు విధాల సక్సెస్ అయ్యాడు. నాని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పవచ్చు. ఇక కీర్తి సురేష్ కు కూడా మహానటి తర్వాత దసరా సినిమాతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో చాలా న్యాచురల్ లుక్ లో కనిపించిన కీర్తి సురేష్ మంచి సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో ఈ బ్యూటీ కి వరుస ఆఫర్లు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.