Nani : నాని హీరోగా ఎదురుదెబ్బలు.. నిర్మాతగా లాభాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nani : నాని హీరోగా ఎదురుదెబ్బలు.. నిర్మాతగా లాభాలు..!

Nani : నేచురల్ స్టార్ నాని మేకర్స్‌కు మినిమం గ్యారెంటీ హీరో. తనతో సినిమా చేస్తే నిర్మాతకు మినిమం లాభాలుంటాయి. ఫైనల్‌గా నష్టం రాదనేది అందరి నమ్మకం. కానీ, గత కొంత కాలంగా మంచి కథలను ఎంచుకుంటున్నా కూడా నానీ సినిమాకు ఆశించిన లాభాలు రావడం లేదు. నిర్మాత రోడ్డున పడే పరిస్థితులు ఉండటం లేదు గానీ, నాని ఖాతాలో హిట్ మాత్రం చేరడం లేదు. ఏ సినిమా చేసి నమ్మకాలు పెట్టుకున్నా నానికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. […]

 Authored By govind | The Telugu News | Updated on :19 June 2022,12:00 pm

Nani : నేచురల్ స్టార్ నాని మేకర్స్‌కు మినిమం గ్యారెంటీ హీరో. తనతో సినిమా చేస్తే నిర్మాతకు మినిమం లాభాలుంటాయి. ఫైనల్‌గా నష్టం రాదనేది అందరి నమ్మకం. కానీ, గత కొంత కాలంగా మంచి కథలను ఎంచుకుంటున్నా కూడా నానీ సినిమాకు ఆశించిన లాభాలు రావడం లేదు. నిర్మాత రోడ్డున
పడే పరిస్థితులు ఉండటం లేదు గానీ, నాని ఖాతాలో హిట్ మాత్రం చేరడం లేదు. ఏ సినిమా చేసి నమ్మకాలు పెట్టుకున్నా నానికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కరోనా కారణంగా నేరుగా నాని సినిమాలు ఓటీటీలలో విడుదల చేశారు ‘వి’ ‘టక్ జగదీష్’ అంచనాల మధ్య వచ్చి బాగా నిరాశ పరిచాయి. ఆ తర్వాత థియేటర్స్‌లో వచ్చింది ‘శ్యామ్ సింగ రాయ్’.

గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ..ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోవడం నానికి షాకిచ్చింది. బ్లాక్ బస్టర్ అనుకున్న సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఇక నాని లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. రిలీజ్‌కు ముందు ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాని. నజ్రియా సినిమాకు పెద్ద ఎసెట్ అని చెప్పుకున్నారు. తీరా చూస్తే సుందరం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్దాడు. ఈ సినిమాకు ముందు హిట్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్స్ మాత్రం ఆశించిన విధంగా అందుకోలేకపోయింది. ఇలా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు నాని క్రెడిబిలిటీని బాగా దెబ్బతీస్తే..

Nani Hero Gains as the Producer

Nani Hero Gains as the Producer

Nani : నాని మార్కెట్ ను బాగానే దెబ్బ తీశాయి.

థియేటర్లలోకి వచ్చిన సినిమాలు రెండు నాని మార్కెట్ ను బాగానే దెబ్బ తీశాయి. అయితే, వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ హౌస్ లో నాని నిర్మించిన సినిమాలు కాస్త లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ‘అ!’, ‘హిట్’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించిన నానికి లాభాలతో పాటు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం నాని తన బ్యానర్ ద్వారా మరో రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు. ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ గా అడవి శేష్‌తో’హిట్ 2′, నాని సోదరి దీప్తి గంట దర్శకురాలిగా పరిచయం చేస్తూ ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే, ఇవి ప్రాఫిట్‌లోకి వచ్చాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి హీరోగా ఫ్లాప్స్ చూస్తున్న నాని, నిర్మాతగా మాత్రం
లాభాలను అందుకుంటున్నాడు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది