Nani : పవన్ కళ్యాణ్‌ని కలవడానికి నానికి 14 ఏళ్లు పట్టిందా?
Nani : నేచురల్ స్టార్ నాని ప్రేక్షకులని నిరాశపరచకుండా చెప్పుకోదగ్గ చిత్రాలు చేస్తుంటాడనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన అంటే సుందరానికి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే నిన్న రాత్రి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఆ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఆ సమయంలో నాని.. పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిర […]
Nani : నేచురల్ స్టార్ నాని ప్రేక్షకులని నిరాశపరచకుండా చెప్పుకోదగ్గ చిత్రాలు చేస్తుంటాడనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన అంటే సుందరానికి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే నిన్న రాత్రి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఆ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఆ సమయంలో నాని.. పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిర తరువాత అందరు హీరోలని కలిసాను. కానీ నేను పవన్ కళ్యాణ్‌ను ఎప్పుడు కలవలేదు. విచిత్రంగా ఎప్పుడు కూడా సందర్భం రాలేదు.
ఎప్పుడు కలవకపోయినా.. ఇప్పుడు మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి కలిసినంతా ఫీలింగ్ ఉంది.. మా వాళ్ల అందరికీ ఓ తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది.. అదేంటో రేపు మీ అందరికీ తెలుస్తుంది..’ అంటూ పవన్ డైలాగ్‌తో స్పీచ్‌తో నేచురాల్ స్టార్ నాని అదరగొట్టాడు. పవన్ కళ్యాణ్‌ని కలవడానికి 14 ఏళ్లు పట్టిందంటూ కూడా స్టన్నింగ్ కామెంట్స్ చేశారు నాని. ఇక నాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఈలలతో వేదిక ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈ వేడుకకు విశిష్ట అతిథులు మీరే.. ఈ వేడుకకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ స్పీచ్ ప్రారంభించిన పవన్..
Nani : 14 ఏళ్ల సమయం..
హీరో నానిపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. నాని గారి నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకు చాలా ఇష్టం అని చెప్పారు పవన్. ఆయన బలంగా నిలబడే వ్యక్తి అని, భగవంతుడు నానికి గొప్ప విజయాలు ఇవ్వాలని పవన్ కోరుకున్నారు. ముందు ముందు నాని అద్భుతమైన విజయాలు సాధించాలని అన్నారు. హీరోయిన్‌గా నటించిన నజ్రియా నజీంకి, నరేష్ వీకే, నదియా, రోహిణికి, నజ్రియా ఇతర నటీనటులందరికీ ధన్యవాదాలు చెప్పారు పవన్ కళ్యాణ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాకతో అంటే సుందరానికి చిత్రానికి మంచి ప్రమోషన్ లభించనట్టే అయింది.