Bigg Boss 8 Telugu : మ‌ణికంఠ ఏడుపు గురించి నాగ్ క్లాస్..ఈ రోజు ఎలిమినేట్ కానుంది ఎవ‌రో కాదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : మ‌ణికంఠ ఏడుపు గురించి నాగ్ క్లాస్..ఈ రోజు ఎలిమినేట్ కానుంది ఎవ‌రో కాదు..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజు రోజుకి ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ప్ర‌తి వారం కూడా ఎలిమినేష‌న్స్ జ‌రుగుతుండ‌గా, అన్నీ కూడా ఫెయిర్ ఎలిమినేష‌న్స్ అన్న‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓటింగ్‌లో తక్కువ ఉన్న కంటెస్టెంట్స్‌ను మాత్రమే ఎలిమినేట్ చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరుగా ప్ర‌తి […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : మ‌ణికంఠ ఏడుపు గురించి నాగ్ క్లాస్..ఈ రోజు ఎలిమినేట్ కానుంది ఎవ‌రో కాదు..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజు రోజుకి ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ప్ర‌తి వారం కూడా ఎలిమినేష‌న్స్ జ‌రుగుతుండ‌గా, అన్నీ కూడా ఫెయిర్ ఎలిమినేష‌న్స్ అన్న‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓటింగ్‌లో తక్కువ ఉన్న కంటెస్టెంట్స్‌ను మాత్రమే ఎలిమినేట్ చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరుగా ప్ర‌తి వారం హౌజ్ నుండి ఒక‌రు ఎలిమినేట్ అవుతున్నారు. అయితే కొత్తగా 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు ఐదో వారం రెండు సార్లు ఎలిమినేషన్స్ నిర్వహించారు.

Bigg Boss 8 Telugu ఈ రోజు మ‌రో ర‌చ్చ‌..

బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం మిడ్ వీక్‌ ఎవిక్షన్‌లో భాగంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు.ఇక ఇదే ఐదో వారం వీకెండ్‌లో నైనిక ఎలిమినేట్ అయింది. నైనిక ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ శనివారం (అక్టోబర్ 5) పూర్తి అయింది. ఇవాళ్టీ (అక్టోబర్ 6) ఎపిసోడ్‌లో ప్రసారం చేయనున్నారు. కానీ, ఈపాటికే నైనిక ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఢీ షో ద్వారా పాపులర్ అయిన నైనిక ఎలిమినేషన్ నేడు చూపించనున్నారు. నైనిక ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ప్రసారం చేయనున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0 ఈవెంట్‌తో 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హోజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.

Bigg Boss 8 Telugu మ‌ణికంఠ ఏడుపు గురించి నాగ్ క్లాస్ఈ రోజు ఎలిమినేట్ కానుంది ఎవ‌రో కాదు

Bigg Boss 8 Telugu : మ‌ణికంఠ ఏడుపు గురించి నాగ్ క్లాస్..ఈ రోజు ఎలిమినేట్ కానుంది ఎవ‌రో కాదు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 34వ రోజు సరదాగా సాగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. ఆయన్ని నాగార్జున వేదికపైకి పిలిచి మాట్లాడారు. మణికంఠ ఏడుపు గురించి క్లాస్ పీకుతూ ఎపిసోడ్ ని ప్రారంభించారు. హౌస్ మేట్స్ చేత చిన్న గేమ్ ఆడించారు నాగార్జున. ప్రతి ఒక్కరు మిగిలిన వారిలో ఇద్దరినీ ఎంచుకుని వారిలో ఉన్న జెలసీ, విసిగించడం లాంటి బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలి. మణికంఠ అయితే తాను ఎవరిని జడ్జ్ చేయనని.. ఎందుకంటే తనలోనే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని ఏడ్చేశాడు.ఇక త‌న‌తో పాటు వేదిక‌పై ఉన్న ఆదిత్య‌ని పంచ్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తావు అని నాగ్ అడగగా.. యాష్మి, మణికంఠ పేర్లని ఆదిత్య తెలిపాడు. ఎందుకంటే యాష్మి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని ఆదిత్య సూచించాడు. అదే విధంగా మణికంఠ కూడా గేమ్ లో చాలా ఇంప్రూవ్ కావాలని.. నిన్ను నీవు నిరూపించుకోవాలని ఆదిత్య సూచించాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది