Naresh – Pavitra Lokesh : మొత్తం లుక్.. రేంజ్ మార్చేసిన పవిత్ర లోకేష్.. వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naresh – Pavitra Lokesh : మొత్తం లుక్.. రేంజ్ మార్చేసిన పవిత్ర లోకేష్.. వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :11 April 2023,4:00 pm

Naresh – Pavitra Lokesh : దాదాపు ఏడాదికి పైగా పవిత్ర లోకేష్ పేరు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. దీనికి ప్రధాన కారణం నటుడు నరేష్ తో ఉండటం. భార్య రమ్య రఘుపతితో దూరంగా ఉన్నాక.. నరేష్ పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. ముఖ్యంగా “మా” ఎలక్షన్ లో అధ్యక్షుడిగా నరేష్ పోటీ చేసిన సమయంలో.. ప్రచారంలో పవిత్ర లోకేష్ ప్రముఖ పాత్ర పోషించారు.

Naresh & Pavitra Lokesh Latest Visuals @ Elurupadu Village | Manastars -  YouTube

అప్పటినుండి ఇద్దరు చట్టాపట్టాలేసుకుని జరగటం… ఒకే చోట ఉండటంతో వీరి గురించి రకరకాల వార్తలొచ్చాయి. ఇటువంటి పరిస్థితులలో గత ఏడాది డిసెంబర్ నెలలో పవిత్ర లోకేష్ కి లిప్ కిస్ పెడుతూ వచ్చే ఏడాది.. పెళ్లి చేసుకోబోతున్నట్లు నరేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా తాజాగా మళ్లీ పెళ్లి అని త్వరలో.. ఒకటవతున్నట్లు తెలిపారు.

Naresh and Pavitra Lokesh Visits Elurupadu Temple

Naresh and Pavitra Lokesh Visits Elurupadu Temple

ఈ క్రమంలో ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం దగ్గర ఏలూరుపాడులో ఓ ఆలయ వేడుకకు పవిత్ర లోకేష్.. నరేష్ హాజరయ్యారు. ఈ క్రమంలో పవిత్ర లోకేష్ లుక్, రేంజ్ మొత్తం మారిపోయింది. బేబీ హెయిర్ తో… ఖరీదైన స్పెట్స్ తో… నరేష్ తో పాటు కారు దిగి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. పవిత్ర లోకేష్ లేటెస్ట్ లుక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

YouTube video

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది