Rashmi Gautam : రష్మీతో స్నానం!.. నరేష్ కోరికలు మామూలుగా లేవుగా
Rashmi Gautam : మరికొన్ని రోజులలో సంక్రాంతి పండుగ రావడంతో బుల్లితెర పై ప్రతి ఒక్క ఛానల్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి.ఈ క్రమంలోని ఈటీవీ ప్రతి ఒక పండుగకు ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మమ్మగారి ఊరు అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తమదైన శైలిలో వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, ఇమ్మానియేల్, పొట్టి నరేష్ కు స్నానం చేయించే కార్యక్రమాన్ని చూపించారు. వీరందరికీ పూర్ణ, రష్మీ, వర్ష, ఫైమా వంటి వారు నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నారు.

Naresh intresting comments about rashmi Gautam in ammamma gari ooru promo
Rashmi Gautam : ఎంత ఊహించుకున్నా అలా బయటకు చెపేస్తావా…
ఇలా అందరికీ స్నానాలు చేయిస్తుంటే పొట్టి నరేష్ రష్మీ తో స్నానం చేస్తుంటే అంటూ అనగా.. వెంటనే హైపర్ ఆది రష్మీ స్నానం చేయిస్తుంటే అంటూ చెప్పడమే కాకుండా ఎంత ఊహించుకుంటే అలా మనసులో ఉన్న కోరికను బయటపెట్టేస్తావా అంటూ హైపర్ ఆది పొట్టి నరేష్ పై తనదైన శైలిలో పంచ్ వేశాడు. ఈ ప్రోమో చూసిన పలువురు పొట్టి నరేష్ కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రోమో వైరల్ గా మారింది.
