Rocking Rakesh : జబర్దస్త్ షో అంటేనే అ.. షో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంటాయి. ఇక అందులో కొందరు హద్దులు దాటి నటిస్తుంటారు. అందాల ఆరబోత ఒకెత్తు అయితే.. కొందరు మాత్రం వింత చేష్టలతో అందరినీ విసిగెత్తిస్తుంటారు. తాజాగా సీరియల్‌లో నటించే సీనియర్ నటి జబర్దస్త్ షోకు వచ్చింది.
సీరియల్‌లో నటించే నట కుమారి జబర్దస్త్ షోకు వచ్చింది. ఆమె నటించడం ఇదేమీ మొదటి సారి కాదు. ఇది వరకు చాలాసార్లు వచ్చింది. స్పెషల్ ఈవెంట్లోనూ కనిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చింది. నటకుమారి చేసే డ్యాన్సులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. క్లాసికల్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. కానీ మాస్ స్టెప్పులు వేస్తే అవతలి వాళ్లు భయపడాల్సిందే.

Rocking Rakesh : నటకుమారి విశ్వరూపం..
ఇక తన మాస్ స్టెప్పులు, ఊపుడుతో రాకింగ్ రాకేష్‌ను బెదరగొట్టేసింది. ఆమె వేసే స్టెప్పులను చూసి సిగ్గుతో పక్కకు జరిగేశాడు. ఇక మరో సీన్‌లో అయితే కొలతలు తీసుకో అని తన బ్యాక్‌ను దారుణంగా చూపిస్తుంది. అలా మొత్తానికి నటకుమారి స్కిట్‌ను గబ్బు పట్టించేసింది. ఇదంతా చూస్తూ రోజా మాత్రం తన జడ్జ్ సీటులోకూర్చుని పగలబడి నవ్వేసింది.