Navdeep : ఆరోజు ఆ పార్టీకి వెళ్లకుండా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. హీరో నవదీప్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Navdeep : ఆరోజు ఆ పార్టీకి వెళ్లకుండా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. హీరో నవదీప్..!!

Navdeep : హీరో నవదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నవదీప్ హీరోగా అంత సక్సెస్ కాలేదు. దీంతో ఆయన సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. విలన్ పాత్రలో కూడా మెప్పించారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా నవదీప్ ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు ‘ లవ్ మౌళి ‘. ఈ సినిమాలో […]

 Authored By anusha | The Telugu News | Updated on :27 November 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Navdeep : ఆరోజు ఆ పార్టీకి వెళ్లకుండా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. హీరో నవదీప్..!!

Navdeep : హీరో నవదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నవదీప్ హీరోగా అంత సక్సెస్ కాలేదు. దీంతో ఆయన సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. విలన్ పాత్రలో కూడా మెప్పించారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా నవదీప్ ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు ‘ లవ్ మౌళి ‘. ఈ సినిమాలో నవదీప్ ఇంతకుముందు ఎన్నడూ కనిపించిన విధంగా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమా ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ మరోవైపు సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ సినిమా నుండి లవ్ సాంగ్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా గురించి చెప్పమనగా నవదీప్ మాట్లాడుతూ.. అందరూ ఒక పాటర్న్ లో ఉంటారు చిన్నప్పుడు నుంచి ఏదో విని పెరిగి ఉంటాం, మనం చేయాల్సింది ఇది అని లేదా మనకు జరిగేవి కొన్ని ఉంటాయి. మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి మనకు జరుగుతున్నవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ చూసి ఆ అనుభవంతో మనకి ఏం కావాలనేది మనకు తెలుసుకోలేము లేదా తెలుసుకునే పొజిషన్లో మనం ఉండము.

పొద్దున్నే లేవగానే మనకు ఏదో కావాలని తాపత్రయంతో పరిగెడుతుంటాం. సర్వైవల్ కోసం సినిమా చేయాలని తెలుసుకోవడం 2.2,మన పని ఏంటో మనం తెలుసుకోవడం 2.2, నిజంగా లైఫ్ లో ఏం కావాలనుకునేది తెలుసుకోవడం 2.2, ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లకు చెప్పకపోతే ఎలా చెప్పాలో తెలుసుకోవడం 2.2, లైఫ్ లో మనకేం కావాలి మనల్ని మనం ప్రశ్నించుకోకపోతే లైఫ్ ఒకలా వెళుతుంది, నా పర్సనల్ లైఫ్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే మన గోల్ ఏంటో తెలుసుకుంటే మనం చేసే పనులు మారుతాయి.

ఇంతకుముందు సినిమా చేసినప్పుడు నేను సర్వైవల్ కోసం చేయాలేమో. నాకు నేను స్టోరీలు చెప్పుకొని చాలా అనవసరమైన సినిమాలు చేశాను. ప్రేక్షకులు చూస్తున్నప్పుడు నువ్వు ఇది కాదు అన్న అన్నప్పుడు దాకా నాకు తెలియదు. ఈ కథ విన్నప్పుడు నాకు సంబంధించినది లాగానే ఉంది అని నవదీప్ చెప్పుకొచ్చారు.కాగా ఈసినిమాలో హీరోయిన్ గా పంఖురి గిద్వానీ నటించారు. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్‌స్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మించారు. గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది