Naveen polishetty : కాస్త ఓవర్ చేసినట్టుగానే ఉన్నాడు.. నిజమైన ‘జాతిరత్నం’ అతడే!
Naveen polishetty : జాతిరత్నాలు అనే సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో పాటుగా ఫరియా అనే హీరోయిన్ పరిచయం కాబోతోంది. అయితే జాతి రత్నాలు మూవీలో నవీన్ పొలిశెట్టి మెయిన్ లీడ్‌గా కనిపిస్తోంది. అందుకే ప్రచార బాధ్యతలు కూడా నవీన్ పొలిశెట్టి తన భుజాల మీద వేసుకున్నాడు. ఎక్కడ చూసినా జాతిరత్నాలు ప్రమోషన్స్‌లో నవీన్ దుమ్ములేపుతున్నాడు. అయితే నిన్న వరంగల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ నవీన్ సందడే కనిపించింది.

Naveen polishetty in Jathi ratnalu Pre Release Event
వరంగల్ గ్రాండ్‌గా నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అయితే ఈ కార్యక్రమం అప్పటికే చాలా ఆలస్యమైంది. అలాంటి సమయంలో నవీన్ తన చేతిలోకి మైక్ తీసుకుని అందరికీ విసుగు తెప్పించాడు. అప్పటికే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ షార్ట్ అండ్ స్వీట్‌గా తమ ప్రసంగాలను ముగించేశారు. కానీ నవీన్ మాత్రం తన ప్రసంగం కంటే అతి చేయడం మీదే ఎక్కువగా శ్రద్ద చూపెట్టినట్టున్నాడు.
Naveen polishetty : నిజమైన ‘జాతిరత్నం’ అతడే!
ఓ మాట మాట్లాడటం.. ఐ లవ్యూ అని చెప్పడం.. తన కోసం లేడీ ఫ్యాన్స్ పడి చచ్చిపోతోన్నట్టు కలరింగ్ ఇస్తూ వచ్చాడు. అలా ప్రసంగం కంటే ఇలాంటి అతి చర్యలే ఎక్కువయ్యాయి. వెనకాల నుంచి టైం అవుతోందంటూ చెప్పినా కూడా నవీన్ అవేమీ పట్టించుకోలేదు. తన పంథా ఏదో తనదే అన్నట్టుగా చెప్పుకుంటూ పోయాడు. మొత్తానికి ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తరువాత అతి సుధీర్ఘమైన ప్రసంగం నవీన్ పొలిశెట్టిదే. నవీన్ ప్రసంగం చూస్తే నిజమైన జాతిరత్నం అనిపిస్తోంది.