Navya Swamy : స్లీవ్ లెస్ లుక్‌తో కట్టిపడేసిన నవ్యస్వామి.. ఆ విషయం చెబుతూ సీరియల్ యాక్టర్ ఓపెన్
Navya Swamy మొదట కన్నడ భాషలో పలు సీరియల్స్ చేసిన నవ్యస్వామి.. ఆ తర్వాత తెలుగు తెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ఆడియన్స్ పల్స్ పట్టేసింది. అందంతో పాటు తనదైన అభినయంతో పలు టీవీ సీరియల్స్ ద్వారా ఆకట్టుకుంటోంది. రోజురోజుకు ఆమె పాపులారిటీ మరింత పెరుగుతుండటంతో పలు టీవీ కార్యక్రమాలకు గెస్టుగా ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.రవికృష్ణ అనే మరో బుల్లితెర నటుడితో ‘ఆమె కథ’ అనే సీరియల్‌లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె, అతనితో క్లోజ్ రిలేషన్ నడుపుతోందనే టాక్ నడిచింది.

Navya Swamy Latest Pics Goes Viral
ఇద్దరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కావడంతో రాను రాను వీళ్ళ మడమ లవ్ ట్రాక్ నడుస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకునేందుకు రెడీ అయ్యారనే వార్తలు గుప్పుమనడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించే నవ్యస్వామి.. తనకు సంబంధించిన పలు ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫెస్టివ్ లుక్ అంటూ తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Navya Swamy నవ్యస్వామి కూల్ లుక్స్

Navya Swamy Latest Pics Goes Viral
చేతికి గడియారం తొడిగి స్లీవ్ లెస్ లుక్‌తో ఆమె ఆకర్షిస్తోంది. ఇవి చూసి ”సూపర్, బ్యూటిఫుల్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో నవ్య ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతూ వస్తోంది.