Navya Swamy : ఇప్పటి వరకు చేసింది చాలు!.. సుమపై పంచ్ వేసిన నవ్యస్వామి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Navya Swamy : ఇప్పటి వరకు చేసింది చాలు!.. సుమపై పంచ్ వేసిన నవ్యస్వామి

Navya Swamy : బుల్లితెరపై సుమ చేసే షోలు ఎంత సందడిగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సుమ షో అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అలా సుమ చేసే క్యాష్ షో, అందులో వచ్చే గెస్టుల మీద వేసే పంచ్‌లు మామూలుగా వైరల్ అవ్వవు. ఇక ఈ మధ్య అయితే షోలో రొమాన్స్‌ను కూడా జోడిస్తున్నారు. ట్రెండింగ్ పెయిర్‌ను తీసుకొచ్చి మరీ దుమ్ములేపుతున్నారు. అలా క్యాష్ షోలో రవికృష్ణ నవ్యస్వామి చేసిన రొమాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :25 January 2022,6:30 pm

Navya Swamy : బుల్లితెరపై సుమ చేసే షోలు ఎంత సందడిగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సుమ షో అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అలా సుమ చేసే క్యాష్ షో, అందులో వచ్చే గెస్టుల మీద వేసే పంచ్‌లు మామూలుగా వైరల్ అవ్వవు. ఇక ఈ మధ్య అయితే షోలో రొమాన్స్‌ను కూడా జోడిస్తున్నారు. ట్రెండింగ్ పెయిర్‌ను తీసుకొచ్చి మరీ దుమ్ములేపుతున్నారు.

అలా క్యాష్ షోలో రవికృష్ణ నవ్యస్వామి చేసిన రొమాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. గతంలో ఓ సారి నవ్యస్వామి రవికృష్ణలు సుమ క్యాష్ షోలో సందడి చేశారు. ఆసమయంలో ఈ ఇద్దరూ బాగా ట్రెండింగ్‌లో ఉండేవారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే రూమర్లు గుప్పుమన్నాయి. అయితే ఆ సమయంలో ఆ ఇద్దరితో సుమ రొమాంటిక్ స్కిట్లు కూడా వేయించింది.

Navya Swamy Satires On Anchor Suma In Cash Show

Navya Swamy Satires On Anchor Suma In Cash Show

Navya Swamy : సుమపై నవ్యస్వామి కౌంటర్లు..

ఇక మరోసారి ఆ ఇద్దరిని తన షోకు పిలిచింది సుమ. ఈ వారం రాబోయే షోలో సిద్దు విష్ణుప్రియ (రియల్ కపుల్) నవ్యస్వామి రవికృష్ణ (రీల్ కపుల్)లు సందడి చేశారు. సిద్దు విష్ణుప్రియలు ముద్దలతో రెచ్చిపోయారు. గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టమా? లేన అబ్బాయిలు అంటే ఇష్టమా? అని సుమ అడుగుతుంది. గడ్డం ఉన్న అబ్బాయిలే ఇష్టమని నవ్యస్వామి చెబితే.. దాన్ని రీ ప్లే వేసి మరీ చూపిస్తుంది. ఇప్పటికే చేసింది చాలు అని సుమ మీద నవ్యస్వామి కౌంటర్లు వేస్తుంది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది