Nayanthara : వ‌ధువుగా మెరిసిపోతున్న న‌య‌న‌తార‌.. పెళ్లి వేడుక‌కు హాజ‌రైన నార్త్, సౌత్ సెల‌బ్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nayanthara : వ‌ధువుగా మెరిసిపోతున్న న‌య‌న‌తార‌.. పెళ్లి వేడుక‌కు హాజ‌రైన నార్త్, సౌత్ సెల‌బ్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :9 June 2022,8:00 pm

Nayanthara : ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న న‌య‌న‌తార ఎట్ట‌కేల‌కు త‌న ప్రియుడితో పెళ్లి పీట‌లు ఎక్కింది. దాదాపు ఏడేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ అధికారికంగా భార్య భర్తలు అయ్యారు. నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ గా కీర్తి పొందింది. అయితే వీరి పెళ్లికి ప్రముఖ సినీ రాజకీయ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, వంటి తదితరులు ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా నయనతార వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.

ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ వివాహ వేడుక ఘనంగా జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఓ హోటల్‌లో ఈ ప్రేమ పక్షులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న వీరి వివాహ వేడుకకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్‌, దర్శకుడు అట్లీ, రాధికా శరత్‌ కుమార్‌, విజయ్‌ సేతుపతి, కార్తి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే విఘ్నేష్ శివ‌న్ ఈ రోజు పెళ్లికి ముందు ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.

nayanthara looks cute in bride

nayanthara looks cute in bride

Nayanthara : పెళ్లి పీట‌లు ఎక్కేసింది…

‘ఈ రోజు జూన్‌ 9.. ఇది నయన్ లవ్‌.థ్యాంక్యూ గాడ్‌… నా జీవితంలోని అందమైన వ్యక్తులు, విశ్వం, సంకల్పానికి ధన్యవాదాలు !! ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి మంచి యాదృచ్చికం, ప్రతి ఆశీర్వాదం, ప్రతిరోజూ షూటింగ్‌, ప్రార్థనలు నా జీవితాన్ని ఇంత అందంగా మార్చాయి. వీటిన్నింటికి నేను కృతజ్ఞతుడిని. ఇప్పుడు, ఇదంత నా జీవితంలోని ప్రేమకు(నయనతార) అంకితం. మరి కొద్ది గంటల్లో వధువుగా నిన్ను చూసేందుకు పరితపిస్తున్న తంగమై. మన కుటుంబం, స్నేహితుల ఆశీర్వాదంతో అధికారికంగా నీతో కొత్త జీవితం ఆరంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు విఘ్నేశ్‌.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది