Pooja Hegde : అడ్డంగా బుక్ అయిన పూజా హెగ్డే.. తెగ ఆడేసుకుంటున్న నెటిజన్స్
Pooja Hegde : తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ఇమేజ్‌తో స్టార్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. కెరీర్ ఆరంభంలో పెద్దగా హిట్లు రాకున్నా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఈ భామ.. ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. దక్షిణాది, ఉత్తరాది భాషల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. ప్రభాస్, బన్నీ, సల్మాన్, రణ్ వీర్.. ఇలా హీరో ఎవరన్నది తనకు ముఖ్యం కాదని.. నాకు నేనే స్టార్ అంటూ ఆ మధ్య బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. స్టార్ హీరోలతో నటించి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న పూజా హెగ్డే..
ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుందని అప్పుడే పెద్ద దుమారం రేగింది.వరుస సినిమాలు సూపర్ హిట్లు పడడంతో పూజా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తన దూకుడు చూపించింది. అలా ఓ రేంజ్ లో సాగిపోతున్న పూజ ఆటిట్యూడ్ కూడా ఓ రేంజ్ లో చూపించింది. ఇటీవల చాలా ప్రౌడిష్‌గా కనిపించిన పూజా ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ కనిపించారు. వాళ్ళకి ఇప్పుడు టైం స్టార్ట్ అయింది. పూజకి ఇప్పుడు వరస ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నెల కిందటే రాధేశ్యామ్ ఫ్లాపవడం.

netizens trolls on pooja hegde
తాజాగా బీస్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆమెను ట్విట్టర్లో కొందరు ఆట ఆటాడేసుకుంటున్నారు. ముఖ్యంగా బీస్ట్ లో పూజ పాత్రపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత దానికి అంత బిల్డప్ ఇచ్చావా పూజా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా చేతిలో మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలున్నాయి. ఇవి కూడా కాస్ల అటు ఇటు అయ్యాయో పూజా హెగ్డే కెరీర్‌కి పెద్ద ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. నత్తగుల్లలతో చేసిన వంటకాలు భలే ఇష్టంగా తింటాను. నేను తినేవాటిలో ఇదే కొంచెం విచిత్రమైన తిండి అంటూ ఇటీవల పూజా చెప్పుకొచ్చింది.