Hyper Aadi : జబర్దస్త్ షోలో కనిపించిన హైపర్ ఆది.. మొత్తానికే దూరమయ్యాడా?
Hyper Aadi : జబర్దస్త్ షోకు ప్రాణం ఎవరు అంటే.. కచ్చితంగా అందరూ చెప్పేది ఒకే ఒక్క పేరు హైపర్ ఆది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సుధీర్ టీం ఆయువు పట్టు అయితే.. జబర్దస్త్ షోకు ఆది స్కిట్లు హైలెట్. హైపర్ ఆది అంటే పంచుల వర్షం కురవాల్సింది. ఆది స్కిట్లో కనిపిస్తే చాలు ఫేమస్ అవుతుంటాం.. ఆది మా మీద పంచులు వేస్తే చాలు మా బతుకులు మారుతాయ్ అని ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులు చెప్పుకొచ్చారు.ఆది స్కిట్లో ఎంట్రీ ఇవ్వడం వల్లే వర్ష ఇంతగా పాపులర్ అయింది.
సీరియల్ తారలను తన టీంలో స్పెషల్ ఎంట్రీలు ఇప్పిస్తుంటాడు. కరెంట్ టాపిక్‌లను పట్టుకుని తన స్టైల్లో సెటైర్లు వేస్తుంటాడు. అలాంటి ఆది కనిపించకపోతే.. షో రేటింగ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అసలే నాగబాబు బయటకు వెళ్లినప్పుడే ఆది కూడా వెళ్తాడని టాక్ వచ్చింది. కానీ ఎందుకో గానీ ఆది ఆగిపోయాడు.అయితే గత రెండు వారాలుగా షోలో ఆది కనిపించడం లేదు. జబర్దస్త్ షోలో ఆది లేకపోతే ఇంకేం ఉండదు. అది శూన్యంలానే పరిగణించబడుతుంది. జనాలు కూడా అదే అనుకుంటున్నారు.

Netizesn Asking About Hyper Aadi In Jabardasth
ఆది లేని జబర్దస్త్ షోను మేం చూడం అంటూ తిరస్కరిస్తున్నారు. ఢీ షో నుంచి సుధీర్ వెళ్లిపోవడంతో దాని పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో కూడా అంతే అయ్యేట్టుంది.యూట్యూబ్‌లో ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ ఉంది. దాని కింద కామెంట్లు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆది లేని జబర్దస్త్ షోను మేం చూడం అంటూ జనాలు చెప్పేస్తున్నారు. అయితే ఆదికి మిగతా షూటింగ్‌లున్నాయి. అందుకే జబర్దస్త్ షూటింగ్‌లకు వెళ్లలేకపోయాడని తెలుస్తోంది. పండుగ ఈవెంట్లు, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షో అంటూ ఆది ఫుల్ బిజీగా ఉన్నాడు.