Hyper Aadi : ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో మంచి సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది. ఈ షో కి యాంకర్ గా సుదీర్ వ్యవహరిస్తుండగా జడ్జిగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ లో ఉండే ఎంతో మంది కమెడియన్స్ ను ఇందులో దించారు. దాంతో జబర్దస్త్ లోనే ఈ షో కూడా మంచి సక్సెస్ ని దక్కించుకుంది. పెద్ద ఎత్తున రేటింగ్ వస్తున్న నేపథ్యంలో మరింత క్రియేటివిటీ గా ఈ షో ముందుకు తీసుకెళ్తున్నారు. వారం వారం విభిన్నమైన కాన్సెప్ట్ లతో తీసుకు వెళుతున్న కారణంగా మంచి స్పందన వస్తుంది. ఆదివారం ప్రసారమయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కి వస్తున్న ఈ ఆదరణతో నిర్వాహకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఈ సమయంలో షో నుండి హైపర్ ఆది తప్పుకున్నట్లు గా వస్తున్న వార్తలు ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తున్నాయి. మొన్నటి ఆదివారం టెలికాస్ట్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో ఆది కనిపించలేదు. ఆది లేని లోటు క్లియర్ గా ఉంది అంటూ మనం ఇప్పటికే చర్చించుకున్నాం. తాజాగా విడుదలయిన వచ్చే ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో లో కూడా ఆది కనిపించలేదు దాంతో ఇక పై శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది ఉండటం అంటూ చర్చ మొదలైంది. ఆది లేకపోతే ఈ షో కి పెద్దగా ఆదరణ వుండదు అనే టాక్ వినిపిస్తోంది. హైపర్ ఆది వేసిన పంచులు షో కు కచ్చితంగా అదనపు ఆకర్షణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పుడు హైపర్ ఆది లేడు కనుక ఆ స్థానం ను పంచ్ ప్రసాద్ భర్తీ చేయాల్సి ఉంటుంది.
పంచ్ ప్రసాద్ పంచులు వేస్తాడు కానీ ఆయన పంచులు హైపర్ ఆది స్థాయిలో ఉండవు. హైపర్ ఆది, పంచ్ ప్రసాద్, రాంప్రసాద్ మరియు సుధీర్ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉంటేనే షో కు అందం మరియు ఆనందం అన్నట్లుగా నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీవీ ప్రేక్షకులు కచ్చితంగా హైపర్ ఆది ఉండాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వచ్చేవారం కాకుండా ఆ తదుపరి వారం అయినా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ లో సందడి చేస్తాడో చూడాలి. వచ్చే వారం షో లో అన్నపూర్ణమ్మ తో పాటు ఇంకా పలువురు సీనియర్ బుల్లి తెర మరియు వెండి తెర స్టార్స్ రాబోతున్నారు. వారు చేసిన సందడికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఆది ఉంటే మరింత హైలైట్ గా ఉండేదనే టాక్ వినిపిస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.