Nidhhi Agerwal : నిధి అగ‌ర్వాల్ అందాల అరాచ‌కం.. కేక పెట్టించేస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: June 7, 2022, 8:30 pm

Nidhhi Agerwal : ఇటీవ‌ల కుర్ర‌భామ‌లు త‌మ అంద‌చందాల‌తో కేక పెట్టిస్తున్న విష‌యం తెలిసిందే. యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో అందాల భామ నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్నారు. అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించి పర్లేదు అనిపించుకున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నిధి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది.

ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించారు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా త‌ర్వాత నిధి జోరుకు అడ్డంకులే లేకుండా పోయాయి. ఇస్మార్ట్ శంకర్ విజయం అనంతరం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో నిధి అగ‌ర్వాల్‌ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు జయం రవి, శింబు సరసన నటించారు. ఇటీవ‌ల తెలుగులో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన ‘హీరో’ సినిమాలోనూ నిధి హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.

Nidhhi Agerwal beautiful looks

Nidhhi Agerwal beautiful looks

Nidhhi Agerwal : నిధి అందాల జాత‌ర‌..

ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌ అందాల ప్రదర్శన చేశారు. అంతేకాదు ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలోను క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది నిధి అగ‌ర్వాల్. ఈ అమ్మడు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆఫర్ అందుకుంది అనే స‌రికి అంద‌రు షాక్‌లో ఉండిపోయారు. నిధి సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా, సోష‌ల్ మీడియాలో ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. తాజాగా ఎద అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. ఈ అమ్మ‌డి క్యూట్ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp