Niharika Konidela : స‌రికొత్త హెయిర్‌స్టైల్‌తో స‌ర్‌ప్రైజింగ్ లుక్‌లో క‌నిపిస్తున్న నిహారిక కొణిదెల.. షాక్ అవుతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Niharika Konidela : స‌రికొత్త హెయిర్‌స్టైల్‌తో స‌ర్‌ప్రైజింగ్ లుక్‌లో క‌నిపిస్తున్న నిహారిక కొణిదెల.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల త‌న‌య నిహారిక కొద్ది రోజుల క్రితం రేవ్ పార్టీ ఇన్సిడెంట్ తో తెగ హైలైట్ అయిన విష‌యం తెలిసిందే. నిహారిక జొన్నలగడ్డ ఇటు డిజిటల్‌లోను రాణిస్తూనే కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ అదుర్స్ అనిపించింది. ఇక ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసింది.ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో సైలెంట్ మెయింటెన్ చేస్తోన్న ఈ భామ రీసెంట్‌గా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :15 June 2022,7:00 pm

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల త‌న‌య నిహారిక కొద్ది రోజుల క్రితం రేవ్ పార్టీ ఇన్సిడెంట్ తో తెగ హైలైట్ అయిన విష‌యం తెలిసిందే. నిహారిక జొన్నలగడ్డ ఇటు డిజిటల్‌లోను రాణిస్తూనే కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ అదుర్స్ అనిపించింది. ఇక ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసింది.ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో సైలెంట్ మెయింటెన్ చేస్తోన్న ఈ భామ రీసెంట్‌గా ఉగాది రోజున హైదరాబాద్‌లో జరిగిన రేవ్ పార్టీతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆ తర్వాత ఈమె సైలెంట్ మెయింటెన్ చేస్తోంది.కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టా డిలీట్ చేసిన నిహారిక తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి ర‌చ్చ చేస్తుంది. నిహారిక సోషల్ మీడియాలో ఫుట్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు నిహారిక తన లుక్కును పూర్తిగా మార్చేసింది. షార్ట్ హెయిర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. నిహారిక‌ని ఇలా చూసి మైమ‌ర‌చిపోతున్నారు. త‌న అందాల‌ను కొద్ది కొద్దిగా చూపిస్తూ థ్రిల్ అవుతున్నారు నెటిజ‌న్స్. ప్ర‌స్తుతం అమ్మడి పిక్స్ వైర‌ల్‌గా మారాయి. నిహారిక చివ‌రగా 2019లో వ‌చ్చిన సూర్య‌కాంతం, చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాల్లో మెరిసింది.

niharika konidela latest photoshoot pics viral

niharika konidela latest photoshoot pics viral

Niharika Konidela : నిహారిక థ్రిల్..

2021లో వెబ్ సిరీస్‌ను కూడా ప్రొడ్యూస్ చేసింది. చైత‌న్య‌-నిహారిక వెడ్డింగ్‌ 2020 డిసెంబ‌ర్ 9 ఉద‌య్‌పూర్‌లోని ఉద‌య్‌విలాస్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల నిహారిక నెటిజ‌న్స్ తో ముచ్చ‌టించ‌గా, నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అందులో భాగంగా ఓ నెటిజన్ మరీ ఫన్నీ ప్రశ్న సంధించాడు.ఆర్ యూ సింగిల్ అని అడిగిగేశాడు. దానికి నిహారిక తన పెళ్లి ఫోటోను షేర్ చేసింది. నేను సింగిలేనా? అంటూ తన భర్త చైతన్యను కూడా ట్యాగ్ చేసింది. ఇక మరో నెటిజన్.. నంబర్ గురించి అడిగాడు. హుష్ అంటూ చెప్పకూడదు అది సీక్రెట్ అన్నట్టుగా పోజులు పెట్టేసింది నిహారిక.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది