Niharika Konidela : బాబోయ్‌.. అత‌నితో నిహారిక అంత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తుందేంటి?

Authored By Sam C | The Telugu News | Published on: August 31, 2022, 11:00 am

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల త‌న‌య నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో పాటు ఇటీవ‌ల వివాదాల‌లో కూడా చిక్కుకుంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఒక మనసు మూవీతో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చే ఒక్క హిట్ కూడా పడలేదు. హీరోయిన్ గా నటించిన చిత్రాలు పరాజయాలు ఎదుర్కొన్నారు. నటించిన వాటిలో మొదటి సినిమా మాత్రమే కొంతలో కొంత మెరుగు అనిపించింది. సైరా మూవీలో నిహారిక చిన్న క్యామియో రోల్ చేశారు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో నాగబాబు కండీషన్ ప్రకారం పెళ్ళికి ఒప్పుకుంది. ఇక పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు కాస్త దూరంగా ఉన్న ఈ అమ్మ‌డు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ రచ్చ చేస్తుంది.

Niharika Konidela : ఏంద‌మ్మ‌డు ఇలా..

గతంలో కూడా నిహారిక పింక్ ఎలిఫేంట్ బ్యానర్ లో నాన్న కుచ్చి, మాడ్ హౌస్ వంటి సిరీస్లు నిర్మించారు. అయితే నిహారిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేస్తుంటుంది. తాజాగా నిహారిక, చైతన్య ఇద్దరూ జిమ్ వర్కౌట్స్ లో చెమటలు చిందిస్తున్న పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి. నిహారిక ఈ పిక్స్ లో మైండ్ బ్లోయింగ్ హాట్ లుక్స్ తో రెచ్చగొడుతోంది. తాను ధరించిన టాప్ పైకి ఎత్తి యాబ్స్ చూపిస్తోంది. నిహారిక, చైతన్య తీసుకున్న మిర్రర్ సెల్ఫీలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే జిమ్ ట్రైనర్ కూడా పిక్స్ లో క‌నిపిస్తున్నాడు. ఆయ‌న ముందే అలా ఎత్తి చూపిస్తుండ‌డం ప‌ట్ల నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

Niharika Konidela Showing Abs In GYM With Her Husband

Niharika Konidela Showing Abs In GYM With Her Husband

ఈ మధ్య నిహారిక విమర్శల పాలయిన విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్ విష‌యంలో ఈ అమ్మ‌డు పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు కూడా వెళ్లింది. లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న నిహారిక అధికారుల దాడిలో పట్టుబడ్డారు. పోలీసులు ఆమెను స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ పబ్ లో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లభించగా విచారణ ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలు నాగబాబు ఖండించారు. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల పాటు ఆమె దారుణంగా ట్రోల్స్ బారిన ప‌డ్డ ఇప్పుడిప్పుడే కాస్త జ‌నాల మ‌ధ్య తిరుగుతూ క‌నిపిస్తుంది.

Niharika Konidela Showing Abs In GYM With Her Husband

Niharika Konidela Showing Abs In GYM With Her Husband

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp