Nirupam Paritala : డాక్టర్ బాబును ఇరుకున పెట్టిన మంజుల.. బుక్కైన నిరుపమ్ పరిటాల
Nirupam Paritala : నిరుపమ్ పరిటాల, మంజుల పరిటాల జోడికి నెట్టింట్లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. తెరపై జోడిగా నటించి.. నిజ జీవితంలోనూ జోడిగా మారిపోయారు. దశాబ్దానికి పైగా వీరి సంసార జీవితం సాఫీగా సాగిపోంది. తెరపై నిరుపమ్, మంజులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఇద్దరి జోడి, అన్యోన్య దాంపత్యానికి సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరూ ఎంతో చూడముచ్చట్టగా, సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తుంటారు.
ఈ మధ్య యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు. అందులో వీరి తమ పర్సనల్ జీవితాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా మంజుల తమ లవ్ స్టోరీ గురించి చెబుతూ ఓ వీడియోను వదిలింది. ప్రపోజల్ డే అంటూ తమ పాతరోజుల్లోకి వెళ్లిపోయారు. ప్రేమ వ్యవహారం ఎలా మొదలైంది, హైద్రాబాద్‌లో ఎన్ని రకాలుగా తిరిగారు, చివరకు పెళ్లి వరకు వ్యవహారం వచ్చిందో చెబుతూ సరదాగా తమ అభిమానులకు ఎన్నో విషయాలను చెప్పారు.

Nirupam Paritala And Majula Paritala Funny Chat
ఫస్ట్ ఫస్టే డాక్టర్ బాబును మంజుల అడ్డంగా బుక్ చేసింది. ప్రపోజల్ డేట్ చెప్పమని అడిగింది. నాకు డేట్లు, గీట్లు గుర్తుండవని నీకు తెలుసు కదా? అని నిరుపమ్ కౌంటర్ వేశాడు. సర్ మనం ప్రపోజ్ చేసుకున్న తరువాత చూసిన మొదటి సినిమా ఏది? అని అడిగేశాడు. దానికి సమాధానం చెబితే. ఇకపై అన్ని డేట్లు గుర్తు పెట్టుకుంటాను అని మంజుల అంది. ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసి ఉండదని నిరుపమ్ భావించాడేమో కానీ మంజుల కరెక్ట్‌గా చెప్పడంతో నిరుపమ్ అడ్డంగా బుక్కయ్యాడు.
