Nirupam Paritala : ఓంకార్‌తో డాక్టర్ బాబు.. రెడీ అంటోన్న నిరుపమ్ ఫ్యాన్స్
Nirupam Paritala : బుల్లితెరపై ఓంకార్‌ది ఓ ట్రెండ్ సెట్టర్. టీఆర్పీల కోసం ఇప్పుడు వీరంతా ఎమోషన్స్, ఫేక్ డ్రామా అంటూ నాటకాలు ఆడుతున్నారు. కానీ ఇలాంటి వాటిని పదేళ్ల క్రితమే వాడేశాడు ఓంకార్. తన షోల్లో ఎమోషన్స్‌ను పీక్స్‌లో వాడేవాడు. కంటెస్టెంట్లు, జడ్జ్‌ల చేత కన్నీళ్లు పెట్టించేవాడు. కాళ్ల మీద పడి పొర్లిదండాలుపెట్టించేవాడు. అలా ఓంకార్ చేసిన ఎన్నో షోలు హిట్లు అయ్యాయి. జీ తెలుగులో ఓంకార్ చేసిన ప్రతీ షో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Nirupam Paritala In Ohmkar Maaya Dweepam Show
అలా ఆట, మాయాద్వీపం వంటి షోలకు ఇప్పటికీ ఆదరణ ఉంది. అయితే ఓంకార్ మాత్రం ఇప్పుడు స్టార్ మాకు షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడే సిక్స్త్ సెన్స్, డ్యాన్స్ ప్లస్, కామెడీ స్టార్స్ అంటూ తిరుగుతున్నాడు. తాజాగా జీ తెలుగులోకి ఓంకార్ అడుగుపెట్టినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు మాయా ద్వీపం అంటూ చిన్న పిల్లలను ఎంతో ఆకట్టుకున్న ఓంకార్ మధ్యలో ఆ షోను వదిలేశాడు. కానీ మళ్లీ దాన్ని పైకి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. కొత్తగా మాయా ద్వీపం షోను ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Nirupam Paritala : మాయాద్వీపంలో నిరుపమ్ :

Nirupam Paritala In Ohmkar Maaya Dweepam Show
మొదటి ఎపిసోడ్‌కు కార్తీకదీపం డాక్టర్ బాబును తీసుకొచ్చాడు. ఎలాగూ జీ తెలుగులో హిట్లర్ గారి పెళ్లాం అంటూ భారీ సీరియల్‌ను నిరుపమ్ చేస్తున్నాడు. అందుకే ఓంకార్ అడగ్గానే మాయా ద్వీపం షోకు తన కొడుకును తీసుకెళ్లినట్టున్నాడు. నేటి రాత్రి ఆషో రాబోతోందని తప్పకుండా చూడండి అంటూ తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు. దీంతో నిరుపమ్ ఫ్యాన్స్ అంతా కామెంట్లు చేస్తున్నారు. మీరు వస్తున్నారంటే కచ్చితంగా చూస్తామని కామెంట్లు పెడుతున్నారు.