nirupam proposes jwala in karthika deepam
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. మే 16, 2022 సోమవారం ఎపిసోడ్ 1352 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మన పెళ్లి జరుగుతున్నందుకు ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది అని హిమతో అంటాడు నిరుపమ్. కానీ.. హిమ మాత్రం ఏం మాట్లాడదు. ఏమైంది అని అనుకుంటాడు నిరుపమ్. మరోవైపు ప్రేమ్ కు కూడా సంబంధం చూస్తే ఓ పని అయిపోతుంది అని స్వప్నతో అంటాడు సత్యం. దీంతో అవును.. నిరుపమ్ కు కూడా ఒక సంబంధం చూడాలి అంటుంది స్వప్న. అసలు ఈ నిశ్చితార్థం జరిగితే కదా అని షాకిస్తుంది స్వప్న. స్వప్న.. నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు సత్యం. ఇంతకీ ఆ ఉంగరాలు ఏమయ్యాయి అని అడుగుతాడు స్వప్నను.
nirupam proposes jwala in karthika deepam
దీంతో నేనే తీశాను అంటుంది స్వప్న. ఆ తర్వాత గుడిలో పూజ చేస్తున్న శౌర్యను చూస్తుంది హిమ. చూసి షాక్ అవుతుంది. శౌర్య ఏంటి ఇక్కడికి వచ్చింది అని అనుకుంటుంది. ఏం చేయాలో హిమకు అర్థం కాదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నన్ను, నానమ్మను చూస్తే ఏంటి పరిస్థితి అని అనుకుంటుంది. ఇంతలో శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో హిమ ఊపిరి పీల్చుకుంటుంది. హిమ టెన్షన్ పడటం చూసి.. నువ్వేం టెన్షన్ పడకు.. శౌర్య వచ్చాకనే ఈ పెళ్లి జరుగుతుంది అని నచ్చజెబుతుంది. కానీ.. హిమ మాత్రం చివరి నిమిషంలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు సౌందర్యపై రెచ్చిపోతుంది స్వప్న. అది నష్టజాతకురాలు అని మొదట్నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. మీరు ఎవ్వరూ వినలేదు అంటుంది. కార్తీక్, దీపల ప్రాణాలు తీసి వాళ్ల చావులకు కారణం అయింది. శౌర్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం అయింది. అలాంటి దాన్ని తెచ్చి నా కోడలును చేస్తానంటే వద్దు వద్దు అన్నాను.
మీరెవ్వరూ వినలేదు. ఇప్పుడు ఏం జరిగింది. నిశ్చితార్థం దాకా తీసుకొచ్చి నా పరువు, నా కొడుకు పరువు తీశారు. ఇందులో నా తప్పేం లేదు అని అనకు మమ్మీ నేను నమ్మను. అలాంటి నష్టజాతకురాలిని ఇంట్లో పెట్టుకుంటే ఎవ్వరికీ మన:శాంతి ఉండదని ఇప్పటికైనా అర్థమయిందా అని సౌందర్యతో అంటుంది.
ఆరోజు ఐస్ క్రీమ్ తింటుండగా.. శౌర్య.. నిరుపమ్ ను ప్రేమిస్తోందని తెలుసుకున్న తర్వాత ఎలాగైనా నిరుపమ్ ను శౌర్య కు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది హిమ. అందుకే చివరి నిమిషంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెబుతుంది.
ఇదే విషయాన్ని తన అమ్మ నాన్న ఫోటోలకు చెబుతూ ఏడుస్తుంది హిమ. ఏది ఏమైనా.. ఎలాగైనా శౌర్య, నిరుపమ్ పెళ్లి చేస్తానని తన తల్లిదండ్రులకు మాట ఇస్తుంది హిమ. ఆ తర్వాత ఇంట్లో హిమను చూసి సౌందర్యకు కోపం వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది సౌందర్య.
ఇలా కాదని.. హిమ చెంప చెళ్లుమనిపిస్తుంది సౌందర్య. ఏమనుకుంటున్నావు అని తనపై సీరియస్ అవుతుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.