ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశాక మరే సినిమా గుర్తు రాదు : రాజమౌళి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశాక మరే సినిమా గుర్తు రాదు : రాజమౌళి

 Authored By uday | The Telugu News | Updated on :30 November 2020,3:05 pm

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఈ పోరాట యోధుల టీజర్స్ వచ్చి సినిమా మీద భారీ అంచనాలను పెంచేశాయి. యావత్ భారత్ దేశం ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

RRR: Makers share a stunning picture of cast from the sets | Telugu Movie  News - Times of India

కాగా ఈ భారీ మల్టీస్టారర్ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. 50 రోజుల మేజర్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ను పూర్తి చేసి.. వెంటనే కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం రెడీ అవుతున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడంతో రాజమౌళి ప్రపంచస్థాయి నటీనటుల్ని ఎంచుకున్నాడు. ఈ కారణంగానే ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ని తీసుకున్నారు.

Bheem for Ramaraju-RRR(Telugu)-Happy Birthday Ram Charan/NTR,Ajay Devgn/SS  Rajamouli - YouTube

ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద కీరవాణి వర్క్ చేస్తున్నారని సమాచారం. బాహుబలి సినిమా సక్సస్ కి కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. కాగా ఇప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసుకున్న సీన్స్ కు సంబంధించి ఇప్పటికే మెయిన్ బిజియమ్ ను కీరవాణి పూర్తి చేశాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

Ramaraju For Bheem - Bheem Intro - RRR (Telugu) | NTR, Ram Charan, Ajay  Devgn, Alia | SS Rajamouli - YouTube

రాజమౌళి బాహుబలి సినిమాని మించి భారీ సక్సస్ ఇవ్వాలని ఏమాత్రం కామ్రమైజ్ కావడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Rajamouli's 'RRR' team makes big reveals, heroine and antagonists announced  | The News Minute

ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ – ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్స్ గా మారబోతున్నారని ఇప్పటికే ఒకవైపు నందమూరి అభిమానులు మరొక వైపు మెగా అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ చూసిన ప్రతీ ఒక్కరు కొన్నాళ్ళ పాటు మైండ్ లో మరే సినిమా గుర్తు రాదని చెప్పుకుంటున్నారు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది