NTR : నా భార్య 8 నెలల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు.. నాకు ఎస్ చెప్పలేదు..
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసి కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకి సిద్దం అవుతున్నాడు. అయితే కొరటాల ఆచార్య పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దాంతో కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అని జెమిని టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించేందుకు కమిటయ్యాడు. సిల్వర్ స్క్రీన్ మీద ఎంత సందడి చేస్తాడో తనదైన శైలిలో వాక్చాతుర్యంతో ఆట నాది.. కోటి మీది అంటూ బుల్లితెర మీద కూడా ఓ ఆట ఆడిస్తున్నారు ఎన్టీఆర్.

ntr-sensational comments on his wife laxmi pranathi
ఈ క్రమంలో స్వాతంత్య దినోత్సవం ఆగష్టు 15న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ హాట్ సీట్‌లో కూర్చుని రూ.25 లక్షలు గెలుచున్నారు. ఈ మొత్తాన్నీ తన తండ్రి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ హోస్టింగ్ తో బుల్లితెర మీద ఇరగదీస్తున్నాడు. కేవలం కరెంట్ అఫైర్స్ ఇష్యూపైనే షోని నడిపించి బోర్ కొట్టించకుండా.. తన మాటలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇదే సందర్భంగా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుని అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాడు.