Bhola Shankar : చిరంజీవికి అంత సీన్ లేదు.. రూ.50 టికెట్ కూడా ఎవ్వరూ కొనడం లేదు.. అట్టర్ ఫ్లాప్.. ఫైర్ అయిన మహిళ

Authored By Breaking News 2 | The Telugu News | Published on: August 12, 2023, 10:00 am

Bhola Shankar : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉందా అంటే అది భోళా శంకర్ సినిమా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే భోళా శంకర్ మూవీ విడుదలై ఒక్క రోజు అయినా మెగా అభిమానుల సందడి అయితే తగ్గలేదు. ఎక్కడ ఏ థియేటర్ లో చూసినా అదే సందడి. కానీ.. ఇదంతా కేవలం మెగా ఫ్యాన్స్ సందడే అని.. నిజంగా సినిమాకు అంత సీన్ లేదని బయట టాక్ నడుస్తోంది. రజినీ కాంత్ జైలర్ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ భోళా శంకర్ సినిమాకు రాలేదని అంటున్నారు.

old woman fire on chiranjeevi at bhola shankar theatre

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆ రేంజే వేరే. కానీ.. భోళా శంకర్ సినిమాలో అంత దమ్ము లేదని ఒక్క రోజులోనే తేల్చేశారు. ఓ థియేటర్ వద్ద బ్లాక్ టికెట్స్ అమ్ముతూ ఓ బామ్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సినిమాలో దమ్ము లేదు. రజినీకాంత్ సినిమాకే టికెట్స్ ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఆ సినిమానే గ్రేట్ అంటూ ఓ మహిళ చెప్పుకొచ్చింది.

Bhola Shankar : రూ.50 టికెట్ ను కూడా ఎవ్వరూ కొనడం లేదట

నిజానికి ఆ బామ్మ బ్లాక్ టికెట్స్ అమ్ముతోంది. రజినీకాంత్ సినిమా టికెట్స్ అయితే రూ.50 టికెట్ రూ.500 కి అమ్మామని, బాల్కనీ టికెట్ రూ.3000 పోయిందని చెప్పింది ఆ బామ్మ. అదే రూ.50 టికెట్ భోళా శంకర్ సినిమాకు మాత్రం రూ.200 కి కూడా ఎవ్వరూ అడగడం లేదట. తొలి రోజు మార్నింగ్ షో, మ్యాట్నీ షోలకే భోళా శంకర్ పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మున్ముందు భోళా శంకర్ కలెక్షన్స్ వస్తాయా.. లేదా అనే డౌట్ వస్తోంది. చూద్దాం మరి భోళా శంకర్ హిట్ కొడతాడో లేదో?

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp