Chiranjeevi : ఇన్నాళ్ల చిరంజీవి కెరీర్ లో ఇలాంటి వ్యాఖ్యలు మొదటి సారి.. బాస్ ఇది కరెక్ట్ కాదు!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ఆరంభించి నాలుగు దశాబ్దాలకు పైగానే అయింది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని పదుల సూపర్ హిట్స్ అందుకున్నాడు. అలాగే డిజాస్టర్స్ కూడా మూట కట్టుకున్నాడు. గతంలో ఎన్ని సార్లు ఫెయిల్యూర్ వచ్చినా కూడా చిరంజీవి హుందాగా వ్యవహరించే వాడు కానీ ఈసారి ఆచార్య సినిమా విషయంలో మాత్రం ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ ( Godfather) సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆచార్య సినిమా ఫలితం పై ఒకింత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ నేను రామ్ చరణ్ కలిసి చాలా నమ్మకం పెట్టుకొని ఆచార్య సినిమాను చేశాము కానీ దర్శకుడు మమ్ములను నిరాశ పరిచాడు అన్నాడు.
దర్శకుడు ఏదైతే చెప్పాడో అదే మేం చేసాము.. మా చేతిలో సినిమా యొక్క ఫలితం ఉండదని మరోసారి నిరూపితమైంది అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హుందాతనంగా లేవ్వంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిరంజీవి సినిమా సక్సెస్ అయితే సింపుల్ గా ఉండేవారు.. ఫెయిల్యూర్ అయితే తాను బాధ్యత తీసుకుంటాను అంటూ ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన పద్ధతి చాలా విభిన్నంగా ఉందని ఇన్నేళ్ల చిరంజీవి సినీ కెరియర్ లో ఎప్పుడూ కూడా ఇలా చూడలేదంటూ మీడియా వర్గాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక సినిమా ఫెయిల్యూర్ గురించి పదే పదే మాట్లాడడం కరెక్ట్ కాదు, పైగా ఆ సినిమా దర్శకుడిని గురించి మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. కొరటాల శివ ఇప్పటికే కెరియర్ పరంగా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ సమయంలో చిరంజీవి పుండు మీద కారం అన్నట్లుగా పదే పదే విమర్శలు చేయడంతో ఆయనకు భవిష్యత్తులో సినిమా కెరియర్ ఉండే అవకాశం లేదంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హుందాగా ప్రవర్తించాలని తన స్థాయిని మర్చి పోవద్దని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి మాట్లాడిన దాంట్లో అబద్ధం లేకపోవచ్చు.. కానీ నిజాలు బాహాటంగా మాట్లాడితే కాస్త చేదుగా ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.