అభిమానులకు ఇక పండుగే.. నిహారిక పెళ్లికి బయల్దేరిన పవన్ కళ్యాణ్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

నిహారిక పెళ్లిలో ఇక రచ్చే.. ఉదయ్‌పూర్‌లో అకీరా, ఆద్యలతో దిగిన పవన్ కళ్యాణ్

నిహారిక పెళ్లి వేడుకల సంబరాలు ఆకాశన్నంటుతున్నాయి. నిహారిక పెళ్లి వేడుకల్లో భాగంగా బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి. రామ్ చరణ్ బన్నీ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ ఇలా యంగ్ హీరోలందరూ రచ్చ చేస్తున్నారు. నిహారిక చిరు సెల్ఫీలు కూడా బాగా వైరల్ అయ్యాయి. చెర్రీ, బన్నీలతో నాగబాబు దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్‌ మాత్రం నిరాశ చెందుతున్నారు. నిహారిక పెళ్లికి […]

 Authored By uday | The Telugu News | Updated on :8 December 2020,7:49 pm

నిహారిక పెళ్లి వేడుకల సంబరాలు ఆకాశన్నంటుతున్నాయి. నిహారిక పెళ్లి వేడుకల్లో భాగంగా బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి. రామ్ చరణ్ బన్నీ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ ఇలా యంగ్ హీరోలందరూ రచ్చ చేస్తున్నారు. నిహారిక చిరు సెల్ఫీలు కూడా బాగా వైరల్ అయ్యాయి. చెర్రీ, బన్నీలతో నాగబాబు దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్‌ మాత్రం నిరాశ చెందుతున్నారు.

Pawan Kalyan Akira nanadan off To Udaipur For Niharika Wedding

Pawan Kalyan Akira nanadan off To Udaipur For Niharika Wedding

నిహారిక పెళ్లికి పవన్ డుమ్మా కొడతాడా? అసలు వెళ్తాడా?వెళ్లడా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి కోసం కదిలాడు. ఓ వైపు షూటింగ్‌లు, మరో వైపు రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొనలేదు. ముందు నుంచి అనుకున్నట్టుగానే నేరుగా పెళ్లి రోజే ఉదయ్ పూర్‌కు వెళ్తారని అంతా భావించారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా పెళ్లికి బయల్దేరినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan off To Udaipur For Niharika Wedding

Pawan Kalyan off To Udaipur For Niharika Wedding

ఉదయ్ పూర్‌కు అందరూ స్పెషల్ ఫ్లైట్‌లోనే వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా ఉదయ్ పూర్‌కు ఈ సాయంత్రమే స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లాడు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్‌లో పవన్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు ఆద్య, అకీరాలు కూడా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎయిర్ పోర్ట్‌లోని ఫోటోలే ఇంతగా వైరల్ అవుతుంటే.. రేపు పెళ్లిలో దిగే ఫోటోలు ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది