Pawan kalyan : పవన్ కళ్యణ్ – పూరి జగన్నాధ్ కాంబోలో సినిమా.. ఫ్యాన్స్ హర్ట్ అయ్యే న్యూస్..!
Pawan kalyan : పవన్ కళ్యణ్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా అంటే పవన్ కళ్యణ్ ఫ్యాన్స్ తో పాటు పూరి ఫ్యాన్స్.. ఇండస్ట్రీలో వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. పూరి జగన్నాధ్ ని ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం చేసింది పవన్ కళ్యాణే. బద్రి సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయిన పూరి జగన్నాధ్ .. డెబ్యూ సినిమాతో పవన్ కళ్యాణ్ కి భారీ హిట్ ఇచ్చాడు. అంతేకాదు వరసగా భారీ హిట్స్ అందుకున్న పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మారాడు. ఒక దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎవరూ సంపాదించని క్రేజ్ అండ్ మనీ సంపాదించాడు.

Pawan Kalyan and Puri Jagannadh to team up again
బాలీవుడ్ తో పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీలో కూడా పూరి జగన్నాధ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ తో కెమరా మాన్ గంగ తో రాంబాబు అన్న సినిమా తీసి మరో హిట్ ఇచ్చాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా వస్తుందని చాలా సార్లు వార్తలు వచ్చాయి. కాని అది మాత్రం సాధ్యపడటం లేదు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ వరసగా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.
Pawan kalyan : పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాధ్ కాంబోలో సినిమా కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారట.
ఈ ప్రాజెక్ట్స్ లో బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ కే పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అవన్నీ రూమర్స్ అని సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో లైగర్ అన్న సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ తప్ప ఇప్పుడు పూరి జగన్నాధ్ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారట. వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాధ్ కాంబోలో సినిమా కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారట.