Pawan Kalyan : మెగా మామ అల్లుడి ‘వినోదయ్య సిత్తం’ ఎంత వరకు వచ్చిందంటే!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. భీమ్లా నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే అనే విషయం తెలిసిందే. పవన్ అంతకు ముందు చేసిన సినిమాలు నిరాశ పరచడంతో వరుసగా రీమేక్ లపై ఆధారపడ్డాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మరియు భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు రీమేక్ లను కూడా లైన్ లో పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ఒక సినిమాను సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రీమేక్ చేసేందుకు ఓకే చెప్పిన పవన్ తాజాగా వినోదయ్య సిత్తం అనే తమిళ సినిమా రీమేక్ చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్ కోసం సాయి ధరంతేజ్ తో పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. గత వారం రోజులు ప్రచారం జరుగుతున్న ఈ విషయమై తాజా అప్డేట్ ఏంటి అంటే సముద్రఖని ఈ రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్నాడు.ఒరిజినల్ వెర్షన్ కి కూడా ఆయనే దర్శకత్వం వహించాడు. కనుక రీమేక్ కూడా ఆయనే సరైన న్యాయం చేస్తాడనే నమ్మకం ను నిర్మాత వ్యక్తం చేశాడట.

pawan Kalyan and sai dharam tej movie interesting update
పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఓకే చెప్పడం, సాయి ధరంతేజ్ డేట్ లు కూడా ఉండటం తో వెంటనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం 40 రోజుల్లోనే ఈ సినిమాను ముగించేందుకు పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చాడు. అందులో పవన్ కళ్యాణ్ కేవలం 25 కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడని తెలుస్తోంది. జూన్ వరకు ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్దం చేస్తారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది ఈ రీమేక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన అతి త్వరలో వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.