Pawan Kalyan : ఢీ అంటే ఢీ.. సంక్రాంతి బరిలోనే ‘భీమ్లానాయక్’ వర్సెస్ ఆర్ఆర్ఆర్..!
Pawan Kalyan : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సంక్రాంతి బరిలోనే ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు మూవీ యూనిట్ కూడా ప్లాన్ చేసింది. కానీ, ఈ సినిమా విడుదల ఏప్రిల్ 1న ఉండబోతుందని మేకర్స్ ప్రకటించారు. దాంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది ‘సర్కారు వారి పాట’.కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా మాత్రం సంక్రాంతి బరిలోనే ఉండబోతుందని మేకర్స్ మరోసారి అధికారికంగా ప్రకటించారు.
వచ్చే ఏడాది జనవరి 7న వరల్డ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ విడుదల కాబోతున్నది. కాగా, ఈ సినిమాతో పోటీ పడే సత్తా అన్ని సినిమాలకు ఉంటుందని చెప్పలేం. కాగా, పవర్ స్టార్ ఫిల్మ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’తో పోటీ పడేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ అనే పోలీసు ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నారు.
Pawan Kalyan : సినిమాల ‘సంక్రాంతి’ పండుగ..
మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇకపోతే ‘భీమ్లానాయక్’ సినిమాకు పవన్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా, పవన్ ఫ్యాన్ సాగర్. కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి సంక్రాంతి సినిమా బిజినెస్ చాలా బాగా ఉండబోతుందని సినీ పరిశీలకులు అంటున్నారు.
సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాలు థియేటర్స్‌కు వస్తున్నందున సినీ ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. సంక్రాంతి బరిలో ‘రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్’ ఉండబోతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.