Pawan Kalyan : దీపావళి పండుగ ముందే వచ్చేసింది..‘భీమ్లా నాయక్’ ప్రోమో వైరల్..!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా నుంచి ‘లాలా భీమ్లా’ సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సదరు ప్రోమోలో పవన్ కల్యాణ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.ప్రోమోలో పవన్ కల్యాణ్ గోనె సంచుల మధ్య పల్లెటూరి వాతావరణంలో పవర్ ఫుల్ ఫైట్ చేస్తున్నట్లు కనబడుతున్నారు. పవన్ కల్యాణ్ చుట్టూ చక్కటి గ్రామీణ నేపథ్యం ఉంది.

pawan kalyan bhemla song promo
Pawan Kalyan : నాగరాజు గారు.. హార్ట్లీ కంగ్రాచులేషన్స్..
ఎడ్ల బండ్ల మధ్యలో ధాన్యపు రాశి ఉన్న గోనె సంచుల మధ్యలో నుంచి పవన్ కల్యాణ్ బయటకు రావడం ఎలివేటెడ్ సీన్‌గా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి ఉంది. ఇక పవన్ కల్యాణ్ చెప్పి పంచ్ డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘నాగరాజు గారు.. హార్ట్లీ కంగ్రాచులేషన్స్..అండి.. మీకు దీపావళి పండుగ ముందే వచ్చేసిందండి’ అంటూ బాంబు పేల్చేశాడు పవన్ కల్యాణ్. భీమ్లా నాయక్ బటన్ నొక్కగానే మంటల్లో నుంచి సుమో పైకి లేస్తుంది.

pawan kalyan bhemla song promo
‘హ్యాపీ .. దీపావళి’ అంటూ పవన్ కల్యాణ్ చెప్తుండగా.. సుమో పేలిన ప్లేస్ పక్కనే రానా ఉన్నారు. ‘సౌండ్ ఆఫ్ భీమ్లా’ పేరిట విడుదలైన ఈ ప్రోమోకు సంబంధించిన ఫుల్ వీడియో ఈ నెల 7న విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
