Pawan Kalyan : ఇదెక్కడి న్యాయం పవన్ కళ్యాణ్.. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఆ దర్శకుడి పరిస్థితి ఏంటీ?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమా పరంగా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక పోతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో పవన్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పటి వరకు ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు. కనీసం ఆయన పార్టీని నమ్ముకున్న వారికి కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. అత్యంత దారుణమైన రాజకీయం నడుపుతున్న పవన్ అంటూ సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహా అభిప్రాయంను సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తానంటూ చాలా మంది నిర్మాతల వద్ద అడ్వాన్స్ లు తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారి వద్ద దాదాపుగా పాతిక కోట్ల రూపాయల అడ్వాన్స్ ను పవన్ తీసుకున్నాడట. ఆ మొత్తంను భవదీయుడు భగత్ సింగ్ సినిమా ను చేసేందుకు గాను కమిట్ అయిన పవన్ కళ్యాణ్ వారికి రెండు సంవత్సరాలుగా డేట్లు ఇవ్వకుండా నాన్చుతూ వస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కమిట్ అయిన సినిమా లు ఇప్పటికే ప్రారంభం అయ్యి విడుదల కూడా అయ్యాయి.

Pawan Kalyan canceled bhavadeeyudu bhagath singh movie under harish shankar
ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రారంభించారు. వినోదయ్య సిత్తం సినిమాను మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ రెండేళ్లుగా ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ కు హ్యాండ్ ఇచ్చాడు. మరే సినిమా చేయకుండా ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ ను ఇప్పుడు ముంచేసినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు సినిమాలను ఈ గ్యాప్ లో ఆయన చేసేవాడు. పవన్ కళ్యాణ్ కు ఇది న్యాయం కాదు అంటూ కొందరు హరీష్ శంకర్ తరపున మాట్లాడుతున్నారు.