Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూతురుకు ఉన్న ఈ టాలెంట్ గురించి తెలిస్తే ఫిదా అయిపోతారు.. వైరల్ వీడియో

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 4 December 2021, 2:20 pm

Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయి పిల్లలు అకీరా, ఆద్య గురించి తెలుసు కదా. వాళ్లు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ టాలెంటెడ్. ఇద్దరూ తండ్రి పవన్ కళ్యాణ్ జిరాక్స్. వాళ్లు ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో పెద్ద వార్త. రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అకీరా కూడా చాలా పెద్దోడు అయిపోయాడు. పవన్ కళ్యాణ్ కంటే హైట్ ఉన్నాడు. త్వరలోనే అకీరాను కూడా సినిమా హీరోను చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అకీలా ఇప్పటి నుంచే అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు.అకీరా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రతి వీడియో, ఫోటోను మెగా అభిమానులు షేర్ చేస్తుంటారు. అలాగే.. ఆద్య కూడా. తను కూడా మల్టీ టాలెంటెడ్. తాజాగా ఆద్యకు సంబంధించిన ఓ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది.ఆద్య గిటార్ వాయిస్తూ ఉన్న వీడియో అది. ఆద్య గిటార్ వాయిస్తూ తొలిసారి కనిపించడంతో ఆ వీడియోను చూసిన మెగా అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేనా..

pawan kalyan daughter aadhya guitar playing viral video

pawan kalyan daughter aadhya guitar playing viral video

Pawan Kalyan : గిటార్ వాయించి సూపర్బ్ అనిపించిన ఆద్య

తండ్రికి తగ్గ తనయ.. అంటూ కామెంట్లు పెడుతూ.. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.ఆద్యలో ఇంత టాలెంట్ ఉందా.. అని అంతా ఫిదా అవుతున్నారు. అద్భుతంగా గిటార్ వాయించి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది ఆద్య. ఆద్యతో పాటు అకీరాకు కూడా మ్యూజిక్ అంటే ప్రాణం. తను కూడా పియానో వాయిస్తాడు. తన పిల్లలు ఇద్దరినీ బెస్ట్ గా తీర్చిదిద్దడం కోసం రేణు దేశాయ్ చాలా కష్టపడుతోంది. అలాగే.. పవన్ పిల్లలు కాబట్టి..

పవన్ కు తగ్గ పిల్లల్లా వాళ్లలో మల్టీ టాలెంట్ ఉండటంతో మెగా అభిమానుల సంతోషానికి హద్దులే ఉండటం లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఆ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. భీమ్లా నాయక్ తర్వాత.. సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్, క్రిష్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి