Categories: EntertainmentNews

Pawan Kalyan : బర్త్‌ డే స్పెషల్‌… పవన్ కి చనిపోవాలన్నంత ఆవేదన కలగడానికి కారణం ఏంటీ?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న సినీ హీరో మరియు దేశంలోనే అత్యంత క్రియాశీలక రాజకీయ నాయకుల్లో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇప్పటి వరకు రాజకీయాల్లో గెలుపు సాధించుకున్న కూడా భవిష్యత్తులో ఆయన అద్భుతాలను సృష్టించబోతున్నాడు.. ఏదో అద్భుతాన్ని ఆయన చేయబోతున్నాడు అంటూ ఆయన అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు చాలా బలంగా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఆయన నటించిన సినిమాలు కూడా ఒక అద్భుతం అన్నట్లుగా ప్రేక్షకులు ఇప్పటికే చూస్తూ ఉంటారు. ఐదు పదుల వయసు దాటిన పవన్ కళ్యాణ్ యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా మానసిక వేదనలను అనుభవించినట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అయినప్పటికీ కెరియర్ విషయంలో ఒక ప్లానింగ్ అనేది లేకుండా ఇబ్బంది పడేవాడట, అన్ని విషయాల్లో కూడా కన్ఫ్యూజన్లో ఉండేవాడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడలేదు. కానీ చిరంజీవి మరియు వదిన సురేఖ బలవంతం చేయడంతో పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టావలసి వచ్చిందట. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందు పవన్ కళ్యాణ్ తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యే వాడని ఆయన సన్నిహితులు కూడా చెబుతూ ఉండేవారు. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆత్మనూన్యత భావాన్ని ఎదుర్కొన్నాడని, ఆయన మనసు చంచలమైన విషయాల పట్ల ఆసక్తి కనబరిచేదని అంటారు.

Pawan Kalyan faced many challenges in his life

అందుకే ఆయన అనుకున్నది సాధించలేకపోవడంతో లేదా ఏదో ఒక అడ్డంకి తగలడంతో చనిపోవాలన్నంత మానసిక ఆవేదనను ఎదుర్కొనే వాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సందర్భంగా ఏం చేయాలో పాలుపోక చనిపోవాలనుకున్నాను అంటూ చెప్పాడు. ఇప్పడు ఆయన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లో తాను అనుకున్నట్టు అడుగు పెట్టి విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ నా వల్ల కాదు అని చేతులెత్తేస్తే ఇప్పుడు ఆయనకు ఇన్ని విజయాలు సొంతమ అయ్యేవి కావు.. ఇన్ని కోట్ల మంది ఆయన్ను అభిమానించే వారు కాదు. కనుక చావు అనేది ప్రశ్నకు సమాధానం కాదు, కనుక ప్రతి ఒక్కరు బతికి నిలిచి పోరాటం చేయాలి అని పవన్ కళ్యాణ్ జీవితం స్ఫూర్తిదాయకం.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago