Pawan Kalyan : పవన్ సినిమా అప్పుడు అయ్యిందన్నారు ఇప్పుడు కాలేదు అంటున్నారు.. అసలేం జరుగుతోంది?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం ఆయన అభిమానులకు కాస్త చిరాకును తెప్పిస్తోంది. ఒకవైపు రాజకీయాలు చేస్తూ మరో వైపు సినిమాలను చేస్తానంటూ ఆ మధ్య ప్రకటించి వరుసగా నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పిన పవన్ ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవ్వడంతో సినిమాలు మొదలు పెట్టిన నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు. ఏదోలా భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ అదే సమయంలో ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమాను మాత్రం పూర్తి చేయలేకపోతున్నాడు.

ఆయన దాదాపు సంవత్సర కాలంగా అదిగో ఇదిగో అంటూ డేట్లు ఇవ్వకుండా నిర్మాతను మరియు దర్శకుని వెయిటింగ్ లో పెట్టాడు. మళ్లీ ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది అంటూ సమాచారం అందుతుంది. ఆ మధ్య నిర్మాత రత్నం మాట్లాడుతూ సినిమా షూటింగ్ దాదాపుగా 60 శాతం పూర్తి అయిందని త్వరలోనే షూటింగ్ ని పున ప్రారంభించి నెల రోజుల్లోనే పూర్తి చేస్తామంటూ పేర్కొన్నాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.

pawan kalyan hari hara veeramallu movie shooting update

ఇప్పటి వరకు 30% వరకే షూటింగ్ పూర్తి అయిందని దర్శకుడు క్రిష్ సన్నిహితుల వద్ద చెప్పాడట, సినిమాకు దాదాపుగా రెండు నెలల డేట్లు కావాలని పవన్ ని ఇప్పటికే దర్శకుడు అడిగాడని అందుకు పవన్ కళ్యాణ్ ఓకే అన్నాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా జుట్టు పీక్కుంటున్నారు. హరిహర వీరమల్లు మాత్రమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా పవన్ కళ్యాణ్ మొదలు పెట్టి మధ్యలో ఉంచాడు. ఆ ప్రాజెక్టుల సంగతి ఏంటో మరి చూడాలి.

Recent Posts

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు

INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…

2 hours ago

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

3 hours ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

4 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

5 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

6 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

7 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

8 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

9 hours ago