Pawan Kalyan : హైపర్ ఆదిని వదలని పవన్ కళ్యాణ్.. బాబోయ్ అంత పెద్ద ఆఫర్ ఇచ్చాడా?
Pawan Kalyan : బుల్లి తెరపై ప్రస్తుతం నెంబర్ 1 స్టార్ అంటే హైపర్ ఆది పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మొన్నటి వరకు సుడిగాలి సుధీర్ ( Sudigali Sudeer )ఉన్నా కూడా.. ఆయన సినిమాలంటూ వెళ్లి పోయి, స్టార్ మా లో సెటిల్ అవ్వాలనుకుని తప్పులో కాలేసి ఇబ్బందులు పడుతున్నాడు. సుడిగాలి సుధీర్ విషయం పక్కన పెడితే హైపర్ ఆది ప్రస్తుతం బుల్లి తెరపై స్టార్ గా దూసుకు పోతున్నాడు. ఈ సమయంలోనే ఆయనకు వెండి తెరపై కూడా వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. హీరోగా ప్రయత్నాలు చేయకుండా కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా మాత్రమే హైపర్ ఆది నటిస్తూ ఉన్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో హైపర్ ఆది కనిపించిన విషయం తెలిసిందే.
మళ్లీ హైపర్ ఆది( Hyper aadi ) కి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ దక్కింది. సినిమాలో హైపర్ ఆది ది అత్యంత కీలక పాత్ర అవ్వడం వల్లే ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ వర్క్ షాప్ లో హైపర్ ఆది పాల్గొంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. హైపర్ ఆదికి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాలో దర్శకుడు క్రిష్ కీలక పాత్రను కేటాయించినట్లుగా సమాచారం అందుతుంది. ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అయ్యి అందులో హైపర్ ఆది మంచి పాత్రతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే కచ్చితంగా ముందు ముందు పవన్ కళ్యాణ్ చేసే అన్ని సినిమాల్లో కూడా హైపర్ ఆది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.

pawan kalyan give one more chance for hyper aadi in hari hara veeramallu
ఒకప్పుడు ఆలీతో పవన్ కళ్యాణ్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు అలీ స్థానంలో హైపర్ ఆది భర్తీ చేశాడా అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో హైపర్ ఆది ఉంటున్నాడు. ఇంత భారీ ఆఫర్ వచ్చినా కూడా హైపర్ ఆది మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ ఇంకా డాన్స్ ఢీ కార్యక్రమాన్ని వదిలి పెట్టడం లేదు. ఒకవైపు బుల్లి తెరపై సందడి చేస్తూనే మరో వైపు పవన్ కళ్యాణ్ సాయంతో వెండి తెరపై స్టార్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న హైపర్ ఆదికి ముందు ముందు ఎలాంటి సక్సెస్ లు దక్కేనో చూడాలి.