Pawan Kalyan : క్రిష్ వర్క్ షాప్ నిర్వహించింది జనసేన మీటింగ్ కోసమా.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు
Pawan Kalyan : పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అదిగో ఇదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. పెద్ద ఎత్తున హరిహర వీరమల్లు సినిమాలో దర్శకుడు తెరక్కిస్తున్నాడు. నూరు కోట్ల బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాకు ప్రచారం జరుగుతుంది. సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా నూరు కోట్లు కాస్త 125 కోట్లుగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇటీవల హరిహర వీరమల్లు ఫ్రీ షెడ్యూల్ వర్క్ షాప్ అంటూ మూడు రోజుల పాటు నిర్వహించిన విషయం తెలిసిందే.
అందులో పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా పాల్గొన్నారు. ఇక షూటింగ్ పూర్తి అయ్యే వరకు కంటిన్యూగా షూట్ జరుగుతుంది అన్నట్లుగా అభిమానులు అనుకున్నారు. కానీ వర్క్ షాప్ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. వర్క్ షాప్ నిర్వహించింది సినిమా షూటింగ్ కోసం కానీ ఇలా జనసేన కార్యక్రమాల కోసమా అంటూ కొందరు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా చాలా ఆలస్యమైంది. మీరు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు. హరిహర వీరమల్లు గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు అతిలేదు గతి లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
pawan kalyan hari hara veeramallu shooting news
ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటూ పవన్ కళ్యాణ్ను ఆయన అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ప్రశ్నిస్తున్నారు. ఒక సినిమా కోసం డేట్లు ఇచ్చిన నేపథ్యంలో ఆ సినిమా పూర్తి అయ్యేంత వరకు కమిట్మెంట్ తో పని చేయాలని పవన్ కళ్యాణ్ కి ఇది చెప్పాల్సింది కాదని.. కానీ ఆయన ఎంతో మంది సమయంని వృధా చేస్తున్నాడంటూ సినిమా విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా కోసం దర్శకుడు క్రిష్ 3 సంవత్సరాలుగా వెయిట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఆయన నుండి కనీసం నాలుగైదు సినిమాలు అయినా వచ్చేవి. కేవలం పవన్ కళ్యాణ్ వల్ల ఆయన సినిమాలన్నీ రావడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని పవన్ కళ్యాణ్ పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.