Pawan kalyan : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్..
Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది. కానీ కరోనా దెబ్బకి పవన్ కళ్యాణ్ లైనప్ చేసుకున్న సినిమాల షెడ్యూల్స్ మొత్తం తారుమారయ్యాయి. వకీల్ సాబ్ కూడా ఏడాది ఆలస్యంగా రిలీజ్ అయింది. ఆ తర్వాత సినిమాలైనా జెట్ స్పీడ్ లో పూర్తి చేయాలనుకుంటే కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ దెబ్బ కొట్టింది. ఈసారి ప్రభావం పవన్ కళ్యాణ్ మీదే చూపించింది.

pawan-kalyan-harish shankar movie latest update
వకీల్ సాబ్ తర్వాత ఒకేసారి క్రిష్ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మాతగా పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటే యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ ఏకే తెలుగు రీమేక్ లోనూ నటిస్తున్నాడు. రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తుండగా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేచోట సాగుతుంది. శరవేగంగా సాగుతున్న ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడటంతో ఆగిపోయాయి.
Pawan kalyan : టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వదలబోతున్నామని క్లారిటీ ఇచ్చిన మైత్రీ మూవీస్
ఈ ఎఫెక్ట్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న సినిమా మీద పడింది. దాంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పడుతోంది. అయితే ఈ గ్యాప్ లో ఈ సినిమాకి ఇదే టైటిల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇది మేకర్స్ దృష్టికి వెళ్ళడంతో తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. ఒక అద్భుతమైన టైటిల్ అనుకుంటున్నామని..ఈ టైటిల్ అనౌన్స్ చేయడానికి మేము చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నామని, దానికి మంచి సమయం చూసి అనౌన్స్ చేయనున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వదలబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. మైత్రీ మూవీస్ నిరించనున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో 28వది.
#PSPK28 ???? pic.twitter.com/BhpRrBZkw3
— Mythri Movie Makers (@MythriOfficial) June 8, 2021