Pawan kalyan : అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ పవన్ సంచలన వ్యాఖ్యలు.. ముదురుతున్న మెగా- అల్లు వివాదం..!
Pawan kalyan : గత కొద్ది రోజులుగా మెగా- అల్లు వివాదం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తుంది. చెప్పను బ్రదర్ అని ఎప్పుడైతే బన్నీ అన్నాడో అప్పటి నుండి కూడా మెగా- అల్లు వివాదం గురించి నెట్టింట ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇక కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేసిన అల్లు అర్జున్… నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి చంద్రారెడ్డి ఇంటికి […]
ప్రధానాంశాలు:
Pawan kalyan : అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ పవన్ సంచలన వ్యాఖ్యలు.. ముదురుతున్న మెగా- అల్లు వివాదం..@
Pawan kalyan : గత కొద్ది రోజులుగా మెగా- అల్లు వివాదం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తుంది. చెప్పను బ్రదర్ అని ఎప్పుడైతే బన్నీ అన్నాడో అప్పటి నుండి కూడా మెగా- అల్లు వివాదం గురించి నెట్టింట ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇక కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేసిన అల్లు అర్జున్… నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి చంద్రారెడ్డి ఇంటికి నేరుగా వెళ్లి మద్దతు తెలిపాడు. ఇది మెగా ఫ్యామిలీకి అసలు నచ్చలేదు. పరోక్షంగా వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించినట్లు అయ్యింది. పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు సోషల్ మీడియాలో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు.
Pawan kalyan మెగా వర్సెస్ అల్లు..
అల్లు అర్జున్ ని ఉద్దేశించే నాగబాబు ఆ కామెంట్స్ చేశాడని ఫ్యాన్స్ భావించారు. నాగబాబును ట్రోల్ చేశారు. ఆయన కొన్నాళ్ళు ట్విట్టర్ అకౌంట్ కి దూరమయ్యాడు. మళ్లీ తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్.. బన్నీని అన్ ఫాలో చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా నచ్చిన పోర్ట్‌ఫోలియా తీసుకోమని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినా.. తనకు ఎంతో ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, పంచాయతీ రాజ్, శాస్త్ర, సాంకేతిక శాఖలను స్వీకరించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అడవుల పెంపు, సామాజిక ఉద్యానవనాలపై ఆయన దృష్టి సారించారు. పర్యావరణ సంబంధిత అంశాలపై పవన్‌కున్న అవగాహనను చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. పర్యావరణానికి చేటు చేస్తున్న కోనో కార్పస్ చెట్ల నరికివేతకు డిప్యూటీ సీఎం ఆదేశాలిచ్చారు.
ఇక ఏపీ అటవీ శాఖ మంత్రి హోదాలో కర్ణాటక పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని.. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. అంతేకాకుండా సినిమాల్లో ఒకప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు చేసేవారని, ఇప్పుడు స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లు చేస్తున్నారంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ తరహా రోల్స్ వేయడం వల్ల సమాజానికి మంచి కంటే చెడు ఎక్కువ చేసిన వారం అవుతామని పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ని ఉద్దేశించి చేశాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. బన్నీ పుష్ప చిత్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు. అందుకే బన్నీని ఉద్దేశించే పవన్ అలాంటి కామెంట్ చేశాడని అంటున్నారు. దీనిని నాదెండ్ల మనోహర్ ఖండించారు.