Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్రికెటర్ కూడా అని చెప్పిన నాగబాబు.. అకీరా ఎలాంటి వాడో కూడా తేల్చేశాడుగా..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్రికెటర్ కూడా అని చెప్పిన నాగబాబు.. అకీరా ఎలాంటి వాడో కూడా తేల్చేశాడుగా..!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకాలం స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చారు. కొన్నాళ్ల పాటు జనసేన అధ్యక్షుడిగా కష్ట నష్టాలు ఎదుర్కొన్న పవన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా మారారు. ఒంటిచేత్తో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు. టిటిడి అత్యధిక సీట్లు సాధించివుండవచ్చు… చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుండవచ్చు… ఆ రెండు పవన్ కల్యాణ్ వల్లే సాధ్యమయ్యాయని ప్రత్యర్థి వైసిపి నాయకులే అంటున్నారంటే పవన్ కళ్యాణ్ పవర్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. డిప్యూటీ సీఎంగానే కాకుండా కీలక మంత్రిత్వశాఖల బాధ్యతలు సమర్తవంతంగా నిర్వర్తిస్తున్నారు.
Pawan Kalyan నాకు మాటొస్తది..
ఇలా సినిమాల్లో, రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇలా అత్యున్నత స్థాయిలో వున్న తన తమ్ముడిని చూసి మురిసిపోతున్నారు కొణిదల నాగబాబు. జనసేన నాయకుడిగా తమ పార్టీ అధినేతను గౌరవిస్తూనే ఓ అన్నగా తమ్ముడిపై ప్రేమను ప్రదర్శిస్తుంటారు నాగబాబు. తమ్ముడికి రాజకీయంగా సహాయసహకారాలు అందించేందుకు ముందుకు వచ్చినపుడే పవన్ పై నాగబాబు ప్రేమ అర్థమయ్యింది. అయితే తాజాగా తన తమ్ముడి గురించి నెటిజన్ల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఇలా ఇన్ట్సాగ్రామ్ లో మెగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసారు నాగబాబు.పవన్ కల్యాణ్ గురించి ఒక్కమాటల్లో చెప్పండి అంటూ ఓ నెటిజన్ నాగబాబును అడిగాడు. ఇందుకాయన’కొణిదెల పవన్ కల్యాణ్’ అంటూ చాలా చమత్కారంగా సమాధానం చెప్పారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్రికెటర్ కూడా అని చెప్పిన నాగబాబు.. అకీరా ఎలాంటి వాడో కూడా తేల్చేశాడుగా..!
మరో నెటిజన్ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్ కల్యాణ్ బిజీ అయ్యారు… కాబట్టి ఆయన సినిమాలకు దూరమైనట్లే అంటూ జరుగుతున్నప్రచారంపై నాగబాబును క్లారిటీ కోరాడు. ఇకపై పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తారా? లేదా? అని అడిగాడు. ఇందకు చాలా తెలివిగా… ఆయన అక్కడా వుండాలి, ఇక్కడా వుండాలి అంటూ సమాధానం చెప్పారు నాగబాబు. జనసేన పార్టీ 100శాతం స్ట్రైక్ రేట్ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని… ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిదని అన్నారు. ఇక తన అభిమాన హీరో, రాజకీయ నాయకుడే కాదు క్రికెటర్ కూడా పవన్ కల్యాణే… ఆయనలా స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేయడం ఎవరితరం కాదని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ ని కలవడం ఎలా? అన్న ప్రశ్నకు నేరుగా విజయవాడ దగ్గర మంగళగిరికి వెళ్లు…అక్కడ ఎవ్వరినైనా అడుగు పవన్ కల్యాణ్ ఇంటి అడ్రస్ ఎక్కడని… వాళ్లు చెబుతారు… కలిసిరా… ఇంకోమాట ఈ విషయం నేను చెప్పానని తమ్ముడికి చెప్పకు…మాటొస్తది అంటూ ఫన్నీ సమాదానం చెప్పారు నాగబాబు.