Renu Desai : రేణూ దేశాయ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి పవన్ కళ్యాణ్ నువ్వు .. ఏం చేసిందో చూడు !
Renu Desai : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండగా, ఆయన ఇటీవల ఓ సమావేశంలో ఆవేశంగా చేసిన కొన్ని కామెంట్స్ పలు అనుమానాలకు దారితీశాయి. ముఖ్యంగా మూడు పెళ్లిళ్ల విమర్శలను కొట్టిపారేసే క్రమంలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. నేను భార్యలను వదిలేసినా చేయాల్సిన న్యాయం చేశానన్న అర్థంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి చేసుకున్నాను. అలాగే మాజీ భార్యలకు చేయవలసిన న్యాయం చేశానన్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ వైఫ్ నందికి రూ. 5 కోట్ల భరణం ఇచ్చాను. రేణూ దేశాయ్ కి మిగిలిన నా ఆస్తి రాసిచ్చాను అన్నారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా అబద్ధమా? నిజమా? అనే చర్చ మొదలైంది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ తాను భరణంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చిల్లిగవ్వ తీసుకోలేదని చెప్పింది. ‘భరణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఒంటరిగానే నా పిల్లలతో బయటకు వచ్చేశాను’ అని గతంలో చెప్పింది రేణూ దేశాయ్. దీంతో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. రేణు తాజాగా చేసిన పోస్టులో ‘నీ వెర్షన్ కాదు.. నా వెర్షన్ కాదు. నిజం అనేది ఒకటి ఉంటుంది. సత్యం శాశ్వితంగా ఉంటుందనేది నేను లైఫ్ లో నేర్చుకున్న అంశం’ అంటూ ఒక కొటేషన్ ను రీల్ రూపంలో పెట్టారు. రేణూ దేశాయ్ పోస్ట్ ఇప్పుడు పవన్‌కి పాజిటివ్‌గా పెట్టినట్టా లేక నెగెటివ్‌గా పెట్టినట్టా అని అందరు చర్చించుకుంటున్నారు.

Pawan Kalyan should be very careful with Renu Desai
Renu Desai : దీని అర్ధం ఏంటి?
ఏదేమైన రేణూతో జాగ్రత్తగా ఉండాలని పవన్‌కి సూచిస్తున్నారు. 2012 లో పవన్ కళ్యాణ్ అధికారికంగా రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చేశాడు. విడాకుల తర్వాత రేణు మకాం పూణెకి మార్చేశారు. అక్కడే పిల్లలతో జీవనం సాగించారు. ఈ మధ్యలో రెండో పెళ్లి ప్రయత్నాలు కూడా చేశారు. దాన్ని పవన్ అభిమానులు వ్యతిరేకించారు. ఆమెపై సోషల్ మీడియా వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారు. కొన్నాళ్ల క్రితం రేణూ దేశాయ్ హైదరాబాద్ కి మారారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఉంటున్నారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా అదే టైటిల్ తో రూపొందుతున్న మూవీలో నటిస్తున్నారు. .