Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మజాకానా దిగొవచ్చిన ఏబీఎన్..!!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎత్తుగడలు ఏపీ రాజకీయాల్లో ప్రశ్నార్ధకంగా మారాయి. వారాహి యాత్ర స్టార్ట్ చేయబోతున్నట్లు వాహనానికి పూజా కార్యక్రమాలు చేసి.. నానా హడావిడి చేసి… ఇప్పుడు సైలెంట్ అయిపోవడం సంచలనంగా మారింది. ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబుతో కలిసి పవన్ పోటీ చేయనున్నట్లు వార్తలు ముందు నుండి వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబుకి అనుకూలంగా ఉండే ఓ మీడియా పవన్ కళ్యాణ్ కి కేసీఆర్ 1000 కోట్ల ఆఫర్ ఇవ్వటం జరిగిందని.. గత వారం ఓ సంచలన కథనం మీడియాలో ప్రచురించారు. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేసీఆర్ ప్యాకేజి ఇస్తున్నట్లు సదరు మీడియా అధినేత…
కథనం ప్రచారంపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ పరిణామంతో వేయి కోట్ల ఆఫర్ కథనం పై మరింత అనుమానం పెరుగుతోంది. జనసేన పార్టీ వర్గాలు మాత్రం సదరు మీడియా అధినేతపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గతంలో ప్యాకేజి స్టార్ అనీ వైసీపీ నాయకులు కామెంట్లు చేసిన సమయంలో చెప్పు చూపించిన పవన్ ఇప్పుడు చంద్రబాబు అనుకూల మీడియా వెయ్యి కోట్ల ఆఫర్ పై నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయినా గాని ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు.. సదరు మీడియా అధినేతకీ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ రీతిగా ఇష్టనుసారంగా ₹1000 కోట్ల ఆఫర్ లంటూ కథనాలు ప్రసారం చేస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొట్టే రీతిలో… జనసేన అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని..
కౌంటర్లు వేస్తున్నారు. బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టాలన్న సమయంలో.. పార్టీని అధినాయకుడిని తక్కువ చేసి కథనాలు ప్రసారం చేస్తే… తెలుగుదేశం పార్టీకీ.. ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు అవుతాయని.. సదరు మీడియా ఛానల్ అధినేతకి పరోక్షంగా కౌంటర్లు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వారం… సదరు మీడియా ఛానల్ అధినేత.. తన వెయ్యి కోట్ల ఆఫర్ వార్త విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. వెయ్యి కోట్ల ఆఫర్ కథనానికి సంబంధించి కవరింగ్ ఇచ్చే రీతిలో సదరు మీడియా మరో కథనాన్ని ఈ వారం లేటెస్ట్ గా వివరణ ఇచ్చే రీతిలో ప్రచురించింది. సో పవన్ ఫ్యాన్స్ దెబ్బకి సదర మీడియా అధినేత దిగివచ్చినట్లు అయింది.