Akira Nandan : పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని చేసి.. శెభాష్ అనిపించుకున్న అకీరా నందన్.. వీడియో
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్.. అచ్చు గుద్దినట్టే పవన్ కళ్యాణ్ లా ఉంటాడు. అయితే.. పవన్ కళ్యాణ్ లా ఉండటం మాత్రమే కాదు. పవన్ కళ్యాణ్ లా చేసి చూపిస్తున్నాడు అకీరా. నిజానికి.. రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ విడిపోయి వేరే ఉంటున్నా.. పిల్లలను మాత్రం అప్పుడప్పుడు కలుస్తుంటారు పవన్ కళ్యాణ్. వాళ్ల బాగోగులు కూడా చూసుకుంటారు. అయితే.. అకీరా మాత్రం చూడటానికి అచ్చం తండ్రిలాగానే ఉంటాడు. ఆయన చేష్టలు కూడా సేమ్ టు సేమ్ పవన్ లాగానే ఉంటాయని తాజాగా అర్థం అయింది.

pawan kalyan son akira nandan viral video
పవన్ కళ్యాణ్.. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో చేసిన స్టంట్స్ మీకు గుర్తున్నాయా? పవన్ కళ్యాణ్ చేసే సాహసాలే ఆయనకు ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకొచ్చాయి. అవే ఆయన స్టయిల్. అప్పట్లో ఆయన నటించిన చాలా సినిమాల్లో చాలా స్టంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఖుషి సినిమాలో కూడా కర్రసాము లాంటిది చేశారు. జానీ సినిమాలో అయితే ఆయన చేసిన కర్రసాము అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Akira Nandan : తండ్రి లాగానే కర్రసాము చేసి ఆశ్చర్యపరిచిన అకీరా

pawan kalyan son akira nandan viral video
అయితే.. సేమ్ టు సేమ్.. తండ్రి పవన్ కళ్యాణ్ లాగానే కర్రసాము చేసి ఆకట్టుకున్నాడు అకీరా నందన్. ప్రస్తుతం అకీరా నందన్ చేసిన ఈ ఫీట్ ను చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను అకీరా తల్లి రేణు దేశాయ్… సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతైనా పవన్ కళ్యాణ్ కొడుకు కదా. ఆ మాత్రం ఉంటుంది.. ఆ రక్తం ఎక్కడికి పోతుంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
ఇది కూడా చదవండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!
ఇది కూడా చదవండి ==> శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి ముద్దు.. వారి సరసాలను నిలదీసిన శ్రీదేవీ !
ఇది కూడా చదవండి ==> ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కాజల్ అగర్వాల్ ఏం చేస్తోందో చూడండి.. వీడియో