Payal Rajput : పాయల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్.. అంత తప్పు ఏం చేసింది..?
Payal Rajput : అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఈ అమ్మడు తొలి సినిమాతోనే ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత పాయల్‌కి మళ్లీ ఆ రేంజ్ విజయం దక్కలేదు. అయితే ఇటీవల ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో చేసిన ‘మంగళవారం’ చిత్రం పాయల్‌కి మళ్లీ హిట్ తెచ్చిపెట్టింది. దీంతో ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది ఈ బ్యూటీ. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసి వార్తలలోకి ఎక్కింది. తనని నిర్మాతలు బెదిరిస్తున్నారంటూ వాపోయింది
2019-2020 సమయంలో నేను ‘రక్షణ’ అనే సినిమా ఒప్పకున్నాను. ముందుగా ఆ చిత్రానికి ‘5Ws’ అనే టైటిల్ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కానీ రీసెంట్‌గా నాకు దక్కిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అగ్రిమెంట్ ప్రకారం నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇంకా క్లియర్ చెయ్యలేదు. అయినా నన్ను సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారు.” అంటూ పాయల్ చెప్పింది. నాకు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు, అంతే కాకుండా ప్రమోషన్స్ కి రమ్మని అడుగుతున్నారు. నా టీమ్ వాళ్ళతో మాట్లాడారు.
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్.. అంత తప్పు ఏం చేసింది..?
కానీ వాళ్ళు నన్ను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు. నా టీం రక్షణ సినిమా డిజిటల్ ప్రమోషన్స్ కి వస్తాము, నాకు ఇవ్వాల్సిన బాకీ క్లియర్ చేస్తే అని చెప్పినా కూడా వినట్లేదు. నా పేరుని డ్యామేజ్ చేసే విధంగా వాడుతున్నారు. ఇటీవల జరిగిన మీటింగ్స్ లో అసభ్య పదజాలం వాడారు. నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నందుకు నేను ఇప్పుడు లీగల్ గా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. మరి ఈ వివాదం ఎలా సాల్వ్ అవుతుందో చూడాల్సి ఉంది.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.