Allu Arjun : కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్.. షరతులతో అనుమతిచ్చిన పోలీసులు..!
ప్రధానాంశాలు:
Allu Arjun : కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్.. షరతులతో అనుమతిచ్చిన పోలీసులు..!
Allu Arjun : పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన ఘటన్లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఇంకా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. ఐతే ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా అల్లు అర్జున్ పై కేసు ఉండటం వల్ల ఇన్నాళ్లు శ్రీ తేజ్ ని చూసేందుకు అల్లు అర్జున్ కి పర్మిషన్ రాలేదు.
Allu Arjun శ్రీ తేజ్ ని పరామర్శించేందుకు అల్లు అర్జున్..
ఐతే తాజాగా పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. కిమ్స్ హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ ని పరామర్శించేందుకు అల్లు అర్జున్ కి పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐతే అల్లు అర్జున్ హాస్పిటల్ కు వచ్చే విషయం రహస్యంగా ఉండాని…
ముందస్తు సమాచారం తో వస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. వారి సూచనల ప్రకారం అల్లు అర్జున్ శ్రీ తేజ్ ని చూసేందుకు హాస్పిటల్ కు వెళ్తాడు. Allu Arjun, Police, Pushpa 2, Sritej, Allu Aravind