Ram Gopal Varma : రాం గోపాల్ వర్మ మొదలెట్టిన కొత్త మ్యూజిక్ తో రాజకీయ పార్టీ ల హడల్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Gopal Varma : రాం గోపాల్ వర్మ మొదలెట్టిన కొత్త మ్యూజిక్ తో రాజకీయ పార్టీ ల హడల్ !

 Authored By sekhar | The Telugu News | Updated on :25 April 2023,3:00 pm

Ram Gopal Varma : డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. ఎన్నో కాంట్రవర్సీ సబ్జెక్టులను టచ్ చేసి సినిమాలుగా చిత్రీకరించి… తెలుగు రాష్ట్రాలలో ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో అనేక వార్తలకు ఆర్జీవి సెంటర్ గా నిలిచారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతోపాటు వైయస్ అవినాష్ రెడ్డినీ సీబీఐ ఇప్పటివరకు ఐదు సార్లు విచారించటంతో.. ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

political parties huddle with new music started by Ram Gopal Varma

political parties huddle with new music started by Ram Gopal Varma

పరిస్థితి ఇలా ఉండగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని కెలకటం స్టార్ట్ చేశారు. వివేక హత్య వెనక… నిజంగా అబద్ధం ఉందా..? అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనికి సంబంధించిన విషయాలపై తాను త్వరలో నిజాలను బట్టబయలు చేస్తానని ప్రకటించారు. ఈనెల 25న తాను కొత్తగా నిజం అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడతీయడమే. ఆ బట్టలూడదీసి ఉసిరి పారేస్తేనే నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది.

RGV To Come Up With His Stand On YS Viveka Case

అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించడానికి నిజాని… ఎవరు చంపలేరు. కానీ నిజం అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు నటిస్తోంది. దానికి మోసపోయి చచ్చింది అని అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరంతో డాన్స్ చేస్తుండగా ఏదో ఒక రోజు వెనుక నుంచి వచ్చి ముందు పోటు పొడుస్తుంది అని వ్యాఖ్యానించారు. సమాజంలో అన్ని రకాల కోణాల విషయాలకు సంబంధించి వాస్తవాలను తెలియజేసే యూట్యూబ్ ఛానల్ నిజమని ఆర్జీవి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మొట్టమొదటిసారి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాంగోపాల్ వర్మ తన కొత్త యూట్యూబ్ ఛానల్ లో టేకప్ చేయడంతో రాజకీయ పార్టీలలో హడల్ మొదలైంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది