Pooja Hegde : నిహారిక అలా పూజా హెగ్డే ఇలా.. అనుకోని అతిథులతో షాక్!
Pooja Hegde : ప్రస్తుతం నిహారిక, పూజా హెగ్డేలు ఇద్దరూ కూడా తమ తమ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరూ ఒకే చోట కూడా షూటింగ్‌లు చేయడం లేదు. కానీ ఇద్దరి షూటింగ్‌లు జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో మాత్రం ఒకే అతిథి దర్శనమిచ్చింది. పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్టుంది. నిహారిక ఇక తన వెబ్ సిరీస్ షూటింగ్‌ను ఈ మధ్యే మొదలుపెట్టగా అక్కడే బిజీగా ఉంది.

Pooja Hegde and Niharika Konidela shock On seeing Monkey
Pooja Hegde : నిహారిక అలా పూజా హెగ్డే ఇలా..
పూజా హెగ్డే పాల్గొన్న షూటింగ్ స్థలంలో పెద్ద సెట్స్ వేసినట్టున్నాయి. అక్కడ సెట్ మీద కోతులు దర్శనమిచ్చాయి. వాటిని చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అనుకోని అతిథులు సెట్‌లోకి వచ్చాయంటే పూజా హెగ్డే తెగ సంబరపడిపోయింది. అయితే మరో వైపు నిహారిక కూడా అంతే. నిహారిక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ప్రాంతంలో కోతులు దర్శనమిచ్చాయి. వాటిని చూపిస్తూ అనుకోని అతిథులు వచ్చాయని చెప్పుకొచ్చింది.
మొత్తానికి కోతులు వనాలను వీడి జనావాసాల్లోకి వచ్చేశాయి. ప్రస్తుతం ఈ రెండు పోస్ట్‌లు ఒకటే చెబుతున్నాయి. కానీ సందర్భాలు, సమయాలు, ప్రాంతాలు అన్నీ కూడా వేరు. పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్, బ్యాచ్‌లర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. ఒకటి జూన్ మూడో వారంలో రాబోతోంది.. మరొకటి జూలై చివరన రాబోతోంది. ఇవి కాకుండా పూజా హెగ్డే మరో ప్రాజెక్ట్‌ను ఇంత వరకు కన్పామ్ చేయలేదు.